Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యురాలు కెకె శైలజ పుస్తకం
- కమ్యూనిస్టుల జీవితం పూల బాట కాదు : పినరయి విజయన్
న్యూఢిల్లీ : కమ్యూనిస్టుల జీవితం ఎప్పుడూ పూల బాట కాదనీ, ముళ్లను తొలగించి కష్టాలను అధిగమించడం ద్వారానే ముందుకు వెళ్లగలమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. శుక్రవారం నాడిక్కడ కేరళ హౌస్లో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యురాలు, కేరళ మాజీ ఆరోగ్య శాఖ మంత్రి కెకె శైలజ రచించిన 'మై లైఫ్ యాజ్ ఏ కామ్రేడ్' పుస్తకాన్ని విడుదల చేసిన అనంతరం పినరయి విజయన్ మాట్లాడారు. ఒకవైపు ప్రజల సమస్యలకు పరిష్కారాలు వెతకడం సవాలు, మరోవైపు కమ్యూనిస్టు ఆలోచనలను రూపుమాపేందుకు ఇతర ప్రపంచ శక్తుల దాడిని ఎదుర్కొనే సవాళ్ల మధ్యే కమ్యూనిస్టుగా ఎదుగుతున్నాడని తెలిపారు. రాజకీయ కార్యకర్తల ఆత్మకథలు కేవలం జీవిత గాధలు కావని, ఇది దేశ చరిత్రకు, ప్రజలకు దగ్గరగా ఉంటుందని అన్నారు. ఈ పుస్తకం చరిత్రకు, వర్తమానానికి అద్దం పట్టిందని అభివర్ణించారు. మశూచి విజృంభిస్తున్నప్పుడు రోగులకు పాలిచ్చేందుకు ముందుకొచ్చిన వ్యక్తి శైలజ అమ్మమ్మ ఎంకె కళ్యాణిని అని కొనియాడారు. కోవిడ్ మహమ్మారిపై పోరాటంలో మనవరాలు శైలజ ముందంజలో ఉన్నారని కితాబిచ్చారు. పార్టీ నిర్మాణ వ్యవహారాల్లో చూపిన నాయకత్వ పటిమే ఆమెకు మంత్రి పదవి దక్కెందుకు దోహదపడిందని ముఖ్యమంత్రి అన్నారు.