Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ద్వేషపూరిత ప్రసంగాలపై కేసులు నమోదు చేయండి
- రాష్ట్రాలు, యూటీలను ఆదేశించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : దేశంలో ద్వేషపూరిత ప్రసంగాల విషయంలో భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫిర్యాదు అందకపోయినా.. కేసులు నమోదు చేయాలని ఆయా రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాల(యూటీ)ను ఆదేశించింది. ద్వేషపూరిత ప్రసంగాలపై న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. వీటిని తీవ్ర నేరంగా పరిగణించింది. ఇవి దేశంలోని లౌకికత్వంపై ప్రభావాన్ని చూపుతాయని వెల్లడించింది. ద్వేషపూరిత ప్రసంగాల కేసులను నమోదు చేయకపోతే దానిని కోర్టు ధిక్కారంగా పరిగణిస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా ఎవరూ చట్టాన్ని ఉల్లంఘించకూడదని తెలిపింది. గతేడాది అక్టోబర్లో ద్వేషపూరిత ప్రసంగాలపై ఆందోళన వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం నేరస్థులపై సుమోటోగా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ, యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తాజాగా న్యాయస్థానం ఈ ఆర్డర్ పరిధిని పొడిగించింది. తదుపరి విచారణను వచ్చేనెల 12కు వాయిదా వేసింది.