Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ ఇంటెలిజెన్స్ గ్రిడ్ (నాట్‌గ్రిడ్) వ్యక్తులపై నిఘా..!
- కేంద్రహౌంశాఖ డేగ కన్ను..
రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేయటానికి పెగాసెస్ స్పైవేర్‌తో నిఘా పెట్టింది..ఇపుడు దేశ ప్రజలపై నిఘా కోసం ప్రత్యేక టూల్ ను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే మత విద్వేష భావాలతో భారత్‌లో విభజన రాజకీయాలకు మోడీ ప్రభుత్వం ఆజ్యం పోస్తోంది. సామాజిక వర్గాలకు చేయూత నిచ్చే ఎన్నో స్వచ్ఛంధసంస్థలకు వచ్చే నిధులనూ ఆపేసింది. ఇంతటితో ఆగకుండా ఇపుడు జనం వేసే ప్రతి అడుగునూ డేగ కన్నులా పసిగట్టాలను కుంటోంది. దీనికోసం కేంద్రహౌంశాఖ జాతీయ ఇంటెలిజెన్స్ గ్రిడ్ (నాట్ గ్రిడ్) ద్వారా నిఘా చర్యలకు సన్నద్ధమవుతోంది. దీన్ని రాజకీయ మేధావులు, సామాజికవేత్తలు తప్పుబడుతున్నారు.
న్యూఢిల్లీ : విమానాశ్రయాలు, రైల్వేలు, పాన్ రికార్డులు, బ్యాంకులు, పాస్‌పోర్టులు, క్రైమ్, క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ (సీసీటీఎన్ఎస్), టెలికం సర్వీస్ ప్రొవైడర్లు, వాహనాల రిజిస్ట్రేషన్ డేటా, జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్), ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ (ఓఎస్ఐఎన్టీ),కార్పొరేట్ వివరా లు, ఇలా మరే ఇతర వివరాలైనా సరే, రియల్ టైమ్ సమాచారాన్ని తీసుకోవడం ద్వారా వ్యక్తుల, ఇతర సంస్థలపై నిఘాను పెంచడానికి జాతీయ ఇంటెలి జెన్స్ గ్రిడ్ (నాట్‌గ్రిడ్) సిద్ధంగా వున్నదని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక తన వార్తా కథనంలో పేర్కొంది.
కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నాట్‌గ్రిడ్ అభివృద్దిపరిచిన కేంద్రీకృత డేటాబేస్, ఆర్థిక, ప్రభుత్వ వ్యవహారాలలో ఒక వ్యక్తి లేదా కంపెనీ యొక్క అన్ని డిజిటల్ వివరాలను తీసుకుం టోంది. ఎక్కడన్నా అనుమానాస్పద లావాదేవీలను గుర్తించగల లక్షణాన్ని కూడా ఇది అంతర్గతంగా కలిగివుందని ఆ వార్తాపత్రిక పేర్కొంది. ప్రయివేట్, ప్రభుత్వ, అధికార డేటాను ఉపయోగించి జరిపే ఈ నిఘా కార్యకలాపాలు రెండు దశల్లో అమలవుతాయి. మొదటి దశలో నాట్‌గ్రిడ్, సమాంతర టెలికం కంపెనీలతో, ఎన్నికల కమిషన్, ఎయిర్‌లైన్స్ డిజిటల్ డేటాబేస్‌లతో ఏకీకృతమవుతుంది. వీటిమధ్య సం బంధాలు నెలకొన్న తర్వాత, ఒక వ్యక్తి లేదా సంస్థకు సంబంధించిన పూర్తి, సమగ్ర వాస్తవిక సమాచారాన్ని 39 కేంద్ర, రాష్ట్ర సంస్థలకు నాట్‌గ్రిడ్ అందచేయ గలుగుతుంది.
మన వ్యాలెట్పైనే గురి..
పాన్ రికార్డులు, క్రెడిట్ కార్టు వివరాలతో సహా బ్యాంక్ సదుపాయాలు, పాస్‌పోర్టులు, కంపెనీ వివ రాలు, రైల్వే సరుకు రవాణా, ఇమ్మిగ్రేషన్, వాహనాల రిజిస్ట్రేషన్, ఎన్పీఆర్ డేటా ఇవన్నీ ఇప్పటికే ఒక క్లిక్‌తో కేంద్ర, రాష్ట్ర సంస్థలకు అందుబాటులో వున్నాయి. ఇక రెండవ దశలో, డేటా విశ్లేషకులు, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి వెబ్ బేస్డ్ అప్లికేషన్లను సమన్వయ పరిచి, సంపూర్ణమైన డిజిటల్ సమాచా రాన్ని జాతీయ భద్రతా ప్రయోజనాలకు అందించ గలుగుతారని ఆ వార్తా కథనం పేర్కొంది. కేవలం అధీకృత ప్రభుత్వ కస్ట మర్కు మాత్రమే ఈ డేటా అందుబాటు లో వుంటుందని అధికారులు చెబుతున్నారు.