Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చండీగఢ్ : పంజాబ్లో ఘోరం చోటు చేసుకున్నది. లుధియానాలో గ్యాస్ లీకైన ఘటనలో 11 మంది మృతి చెందారు. వీరిలో ముగ్గురు మహిళలు..మరో ఇద్దరు బాలికలు ఉన్నారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ ఘటనలో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. గియాస్పురలోని ఈస్ట్మన్ చౌక్ వద్ద గల సువా రోడ్లో ఒక విషవాయువు లీకైంది. ఈ ప్రమాదం ఆదివారం ఉదయం చోటు చేసుకున్నది. దీంతో 11 మంది మరణించారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నది. వారికి ఆస్పత్రిలో చికిత్సను అందిస్తున్నారురు. అయితే, ఈ గ్యాస్ లీక్ కావడానికి గల కారణాలు ఇప్పటికీ తెలియరాలేదు.