Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో కొంకన్ ఆయిల్ రిఫైనరీ చిచ్చు రేపుతున్నది. ప్రతిపాది రిఫైనరీని బర్సు-సొల్గావ్, దాని చుట్టుపక్కల ఎనిమిది గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రాంతంలో రిఫైనరీ కోసం ఒక పక్క ప్రభుత్వం భూసర్వే ప్రక్రియకు నిర్ణయం తీసుకున్నది. ఆయిల్ రిఫైనరీతో భూములకు, పర్యావరణానికి నష్టం కలిగిస్తుందని ఇక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా స్థానికులు తమ ఆందోళనలను మరింత తీవ్రతరం చేశారు. రిఫైనరీ ఏర్పాటు విషయంలో వెనక్కి తగ్గాలని వారు డిమాండ్ చేశారు.