Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐఎడబ్ల్యూయూ జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
వివిధ రాష్ట్రాల్లోనూ, కేంద్రంలోనూ అధికారం లో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని విధ్వంసం చేయటం, ఆధిపత్య భావజాలాన్ని సమాజంపై రుద్దటమే లక్ష్యంగా పెట్టుకున్నదని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ విమర్శించారు. ఆదివారం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో వ్యవ సాయ కార్మిక సంఘం రాష్ట్ర ముఖ్య కార్యకర్తల విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన వెంకట్ మాట్లాడుతూ కార్పొరేట్లు, మతోన్మాదులు కలిసి దేశంలో పెట్రేగిపో తున్నారని, అరాచకాలు, దౌర్జన్యాలతో పాలన సాగి స్తున్నారని అన్నారు. దేశ సంపదను అడ్డగోలుగా సంపన్నులకు దోచిపెడు తున్నారని విమర్శించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దళితులు, గిరిజనులు, మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సామాజిక తరగతుల హక్కులు చట్టాలను సమాధి చేస్తున్నదని ధ్వజమెత్తారు. ఈ అఘా యిత్యాలకు వ్యతిరేకంగా వ్యవసాయ కార్మికులు ఇతర సామాజిక తరగతు లను కలుపుకొని సమరశీల ఉద్యమాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. యూపీలో మూడు కోట్ల మందికిపైగా దళితులు ఉన్నారని, కోట్లాది మంది ముస్లిం మైనారిటీలు ఉన్నారని, 80 అసెంబ్లీ స్థానాలకుపైగా దళితులకు కేటాయించబడ్డాయని తెలిపారు. యూపీలో మొత్తం వ్యవసాయ, పారిశ్రా మిక ప్రాధాన్యత రంగాలన్నింటి లోని ఉత్పత్తిలో దళితులు, మైనారిటీలే అత్య ధికంగా ఉన్నారని తెలిపారు. ఉత్పత్తిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి దళితులు, మైనారిటీలకు ఇప్పుడు అమలులో ఉన్న హక్కులు, చట్టాలను కాలరాసి చాతుర్ వర్ణ వ్యవస్థను, మనుధర్మ శాస్త్ర అనాగరిక పద్ధతిని తిరిగి తేవడానికి బీజేపీ పన్నాగాలు పన్నుతోందని విమర్శించారు. ఉపాధి హామీని నిర్వీర్యం చేసారని, అభివద్ధి పేరుతో అణగారిన తరగతుల భూములను యోగి ప్రభుత్వం గుంజుకుంటున్నదని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో పనులు లేక ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి పెద్ద సంఖ్యలో ఇతర రాష్ట్రాలకు పేదల వలసలు పోతున్నారని ఆయన తెలిపారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, యూపీ లోని యోగి ప్రభుత్వం కలిసి కష్టజీవులకు నేడున్న కనీస హక్కులు లేకుండా చేస్తున్నారని ఈ దురా ఘాతాలపై ప్రశ్నించినటువంటి వారిపై అమానుషంగా హత్యలు, ఎన్కౌంటర్లు చేస్తున్నారని అన్నారు. నేడు దేశంలోనూ, యూపీలోనూ దళితులపై జరుగుతున్న దాడులు, అత్యాచారా లు, హత్యలు అన్నీ ప్రభుత్వ ప్రేరణతో, ప్రభుత్వం యొక్క అండదండల తోనే జరుగుతున్నాయని, ఇవి ప్రభుత్వ హత్యలు, దాడులు తప్ప మరొకటి కాదని తెలిపారు. రాజ్యాం గం కల్పించిన హక్కులను అడగటానికి అవకాశం లేని పరిస్థితులు నేడు యూపీలో కొనసాగుతున్నాయని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీ దుష్ట ఆర్థిక విధానాలను, రాజ్యాంగాన్ని ధ్వంసం చేయటా నికి చేస్తున్న కుట్రలను సమరశీల పోరాటాల ద్వారా అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.సమావేశంలో వ్యకాస జాతీయ ఉపాధ్యక్షులు బ్రిజిలాల్ భారతి, జాతీయ కమిటీ సభ్యులు సతీష్, రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.