Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ మద్దతు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్ సింగ్‌ను అరెస్టు చేయాలని దేశంలోని అగ్రశ్రేణి రెజ్లర్లు చేస్తున్న ఆందోళనకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ మద్దతు తెలిపారు. మల్లయోధుల నిరసన తొమ్మిదో రోజుకు చేరింది. సోమవారం జంతర్ మంతర్ వద్ద జరిగే ఆందోళనకు వివిధ సంఘాలు, నేతలు మద్దతు తెలుపుతున్నాయి. మాజీ క్రికెటర్, మాజీ మంత్రి నవజ్వోత్ సింగ్ సిద్ధూ మద్దతు తెలిపారు. ఇండియన్ ఉమెన్స్ ప్రెస్ క్రాప్స్ (ఐడబ్ల్యూపీసీ) మద్దతు తెలిపింది. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడి హౌదాలో ఉన్న బ్రిజ్ భూషణ్‌ను తక్షణమే ప్రశ్నించాలని, అరెస్టు చేయాలని ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రాథమిక విచారణ జరిపి కేసు నమోదు చేసిన తర్వాత విచారణలో జాప్యంపై పోలీసులు వివరణ ఇవ్వడం లేదని విమర్శించారు. బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయకుండా ఆందోళన నుంచి వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. కాగా, జంతర్‌మంతర్‌లో తమ నిరసనను కొనసాగిస్తున్న మల్లయోధులు విలేకరుల సమావేశంలో ఎన్నికల లక్ష్యంతో ఆందోళన చేయడం లేదని స్పష్టం చేశారు.