Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫ్యాక్టరీలలో 12 గంటల పనిదినాల చట్టం ఉపసంహరణ : ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటన
చెన్నై : కార్మిక సంఘాల పోరాటానికి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గింది. పరిశ్రమల్లో 12 గంటల పనిదినాలను అనుమతించే ఫ్యాక్టరీల చట్టానికి చేసిన సవరణను ఉపసంహరించుకున్నది. దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్ ప్రకటించారు. ఏప్రిల్ 21న, తమిళనాడు అసెంబ్లీ ఫ్యాక్టరీల చట్టానికి సవరణను ఆమోదించింది. ఇది కార్మికులు వారానికి నాలుగు రోజులు 12 గంటల షిఫ్టులను, మూడు రోజుల సెలవులను ఎంచుకోవడానికి అనుమతించింది. ప్రస్తుతం, కర్మాగారాల్లో ఇది ఎనిమిది గంటల షిఫ్టులుగా ఉండేది. అయితే, స్టాలిన్ సర్కారు తీరుతో కార్మికులు, ట్రేడ్ యూనియన్ల నుంచి వ్యతిరేకత ఎదురైంది.
నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో స్టాలిన్ ప్రభుత్వం ఏప్రిల్ 25 న చట్టాన్ని నిలిపివేసింది. చట్టం కార్మికులను దోపిడీకి గురి చేస్తుందని యూనియన్లు వాదించాయి. సీపీఐ(ఎం), సీపీఐ, విడుతలై చిరుతైగల్ కట్చి లు కొత్త చట్టాన్ని వ్యతిరేకించాయి. చెన్నైలో జరిగిన మే డే కార్యక్రమంలో స్టాలిన్ ప్రసంగిస్తూ చట్టాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. తమిళనాడులోని ఎమ్మెల్యేలందరికీ త్వరలోనే ఈ నిర్ణయం గురించి తెలియజేస్తామని చెప్పారు.