Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : నేషనలిస్ట్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు శరద్‌పవార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్సీపీ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్టు మంగళవారం ప్రకటించారు. ముంబయిలో జరిగిన తన ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పవార్ ఈ ప్రకటన చేశారు. బీజేపీపై పోరాటంలో, విపక్షాలను ఒకే తాటి మీదకు తేవటంలో పవార్ కృషి చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. గత కొంతకాలంగా.. మహారాష్ట్రలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటు న్నాయి. పవార్ అన్న కొడుకు, మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఎన్సీపీపై తిరుగుబాటు చేస్తున్నారన్న ప్రచారం బాగా జరుగుతున్నది. కాగా, ఎన్సీపీ అధ్యక్ష బాధ్యతలన నుంచి పవార్ వైదొలగడాన్ని పార్టీ వర్గాలు జీర్ణించు కోలేకపోతున్నాయి. ఆయన వెంటనే రాజీనామా వెనక్కి తీసుకోవాలని ఎన్సీపీ కార్యకర్తలు, నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాజీనామా సమయంలో పక్కనే ఉన్న ఎమ్మెల్యే జయంత్ పాటిల్ వంటి నేతలు కన్నీటి పర్యంతమైన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. పవార్ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగిన ఆడిటోరియం నుంచి కొందరు బయటకు వెళ్లి, ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు.