Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్లో మహిళల పరిస్థితి దయనీయం
- పని ప్రదేశాలలో తగ్గిపోతున్న స్త్రీలు
- వేతన వ్యత్యాసాలూ ఎక్కువే
- ఔత్సాహికులకు ప్రోత్సాహం కరువు
న్యూఢిల్లీ: జీ-20 దేశాల కూటమికి నేతృత్వం వహిస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్న భారత్ లో మహిళల పరిస్థితి దయ నీయంగా ఉంటోంది. వారు కేవలం ఇంటి పను లకే పరిమితం అవుతు న్నారు. పని ప్రదేశాల లో మహిళల సంఖ్య నానాటికీ తగ్గిపోతోం ది. పురుషులతో పోలిస్తే వేతన వ్యత్యాసమూ ఎక్కు వే. ఔత్సాహిక పారిశ్రామిక వేత్త లుగా రాణించాలని అనుకుంటున్నా అనేక ప్రతి బంధకాలు ఎదురవుతున్నాయి.
మన దేశం ప్రస్తుతం జీ-20 దేశాల అధ్యక్ష స్థానంలో ఉంది. ఈ సంవత్స రం నవంబర్ 30వ తేదీ వరకూ ఈ హోదాలో కొన సాగుతుంది. ఈ హోదాపై అటు కేంద్రం, ఇటు బీజేపీ పాలిత రాష్ట్రాలు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వ హిస్తున్నాయి. ప్రక టనల రూపంలో కోట్లాది రూపాయలు కుమ్మరిస్తు న్నాయి. 'సెంటర్ ఫర్ న్యూ ఎకనమిక్స్ స్టడీస్' (సీఎన్ఈఎస్) అనే సంస్థ జీ-20 దేశాల మధ్య జరిగే చర్చలలో ప్రస్తావనకు వచ్చే అంశా లపై అధ్యయనం నిర్వహించింది. దీని ప్రకారం 'మహిళల నేతృత్వం లో అభివృద్ధి ప్రణాళికలు' అనే అంశాన్ని కూడా చర్చల అజెండాలో చేర్చారు. ఈ నేపథ్యంలో మహిళలు, పురుషుల పనితీరు సూచికల విషయంలో మన దేశం పరిస్థితి ఎలా ఉందన్న విషయాన్ని తెలుసుకునేందుకు సీఎన్ఈఎస్ కొంత సమాచారాన్ని పరిశీలించింది. దేశంలో మహిళా కార్మికుల పాత్ర, మహిళలు-పురుషుల మధ్య పని విభజన, వేతన వ్యత్యాసాలు, మహిళలకు అందుబాటులో ఉన్న వ్యాపార అవకాశాలు అనే విషయాలపై సీఎన్ఈఎస్ ప్రధానంగా పరిశీలన జరిపింది. ఆ వివరాలు....
జర్మనీ, సౌదీ అరేబియా, రష్యా, మెక్సికో వంటి ఇతర జీ-20 దేశాలలో మహిళా కార్మికుల సంఖ్య పెరుగుతుంటే మన దేశంలో మాత్రం 2004 నుండి తగ్గిపోతోంది. ప్రపంచ ఆర్థిక ఫోరం నివేదిక-2022 ప్రకారం జీ-20 దేశాలలో మొత్తం కార్మిక శక్తిలో మహిళా కార్మికుల సంఖ్య 49.78 శాతం ఉంటే మన దేశంలో మాత్రం అత్యంత తక్కువగా 19.23 శాతమే ఉంది. ఇది చాలా అసాధారణం. మహిళలు ఇంటి సంరక్షణ బాధ్యత తీసుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా కన్పిస్తోంది.
వారు ఎలాంటి వేతనం లేకుండానే తమ ఇళ్లలో రాత్రింబవళ్లూ చాకిరీ చేస్తున్నారు. ఇంటి బాగోగులు చూసుకోవడం, వృద్ధుల ఆలనాపాలనా చూడడం వంటి పనులకే పరిమితమవుతున్నారు. మహిళలు రోజుకు 297 నిమిషాల సమయం ఇంటి పనికి వెచ్చిస్తుంటే పురుషులు మాత్రం కేవలం 29 నిమిషాలే కేటాయిస్తున్నారు. అంటే 90.5 శాతం ఇంటి పని మహిళల పైనే పడుతోంది. జీ-20లోని ఇతర దేశాలలో 70.77 శాతం ఇంటి పనిని మహిళలు నిర్వర్తిస్తున్నారు. ఇటలీ మినహా యూరప్ దేశాలు, బ్రిటన్, అమెరికా, కెనడాలలో 61 శాతం ఇంటి పనులు మహిళలే చేసుకుంటున్నారు. భారత్ వంటి వర్ధమాన దేశాలలో మాత్రం ఇంటి పని భారమంతా మహిళల పైనే పడుతోంది. ఆసక్తికరమైన విషయమేమంటే ఇంటి పనులు చేస్తున్న పనివారిలో కూడా ఎక్కువగా మహిళలే ఉంటున్నారు. ఒకవేళ పనివారిని నియమించుకుంటున్నా ఇంటిలోని మహిళలు బయట పనులకు వెళ్లడం లేదు. బెంగళూరు, చెన్నై వంటి మెట్రోపాలిటన్ నగరాలలో 40 శాతం కుటుంబాలు ఇంటి పనులకు బయటి మహిళలను తీసుకుంటున్నాయి.
ఇక వేతన వ్యత్యాసం విషయానికి వస్తే 2022లో రూపొందించిన ఓ నివేదిక ప్రకారం భారతీయ మహిళలు సంవత్సరానికి 2130 డాలర్లు సంపాదిస్తుంటే పురుషులు 9900 డాలర్లు ఆర్జిస్తున్నారు. అంటే మహిళల కంటే పురుషుల ఆదాయం 79 శాతం అధికం. జీ-20లోని ఇతర దేశాలలో సగటు ఆదాయ వ్యత్యాసం 43 శాతమే. అంటే జీ-20 దేశాలన్నింటిలోనూ మన దేశంలోనే మహిళలు, పురుషుల మధ్య ఆదాయ వ్యత్యాసం ఎక్కువగా ఉంది.
ఈ పరిస్థితిని మార్చేందుకు సీఎన్ఈఎస్ పలు సూచనలు చేసింది. మహిళలకు ఉన్నత విద్యను అందించేందుకు కృషి చేయాలని, వివిధ రంగాలలో పనిచేసేందుకు మహిళలకు అవకాశాలు పెంచాలని, మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక వనరులు లభించేలా చూడాలని సిఫార్సు చేసింది. సింగిల్విండో అనుమతులు, పన్ను రాయితీలు వంటి ఇతర చర్యల ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని సూచించింది.