Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కేరళపై సంఘ్ పరివార్ విద్వేషపూరిత దాడికి కౌంటర్‌గా డీవైఎఫ్ఐ సోషల్ మీడియా ప్రచారాన్ని ప్రారంభించింది. 'రియల్ కేరళ స్టోరీ (నిజమైన కేరళ కథ)' పేరుతో యూట్యూబ్ ఛానెల్‌ను డీవైఎఫ్ఐ ప్రారంభించింది. తమకు రాష్ట్రానికి సంబంధించిన వాస్తవ కథనాలను ఎవరైనా పంపవచ్చని ప్రజలను కోరింది. కేరళకు వ్యతిరేకంగా సంఫ్‌ు పరివార్ దాడిని తిప్పికొట్టేందుకు, వాస్తవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు తాము పెద్ద ఎత్తున సోషల్ మీడియా ప్రచారాన్ని ప్రారంభించనున్నామని డీవైఎఫ్ఐ ఆ రాష్ట్ర అధ్యక్షులు వికె సనోజ్ తెలిపారు. 'రాష్ట్రంలోని వాస్తవ కథనాలను ప్రజలెవరైనా మాకు పంపవచ్చు. ఈ వీడియోలను తనిఖీ చేసి వాటిని మేం అప్లోడ్ చేస్తాం. ఈ వీడియోలు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు కూడా అప్లోడ్ అవుతాయి' అని సనోజ్ చెప్పారు.డీవైఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ ఎఎ రహీమ్ మాట్లాడుతూ 'లవ్ జిహాద్, నార్కోటిక్స్ జిహాద్ ప్రచారాల నుండి వారు ఇలాంటి విద్వేష ప్రచారాలకు ఆర్ఎస్ఎస్ పాల్పడుతున్నది. కేరళ ప్రతిష్టను దిగజార్చడానికి వారు సోషల్ మీడియా ద్వారా అనేక తప్పుడు ప్రచారాలను చేస్తున్నారు'' అని విమర్శించారు.
'మత సామరస్యం నుంచి పర్యాటక ప్రాంతాల వరకు, విద్య, పేదలకు ఇండ్లు అందించే లైఫ్ మిషన్ వంటి సామాజిక సంక్షేమ పథకాల వరకు ఏవైనా అంశాలు కేరళ అభివృద్ధిని ప్రతిబంభించే వాస్తవ వీడియో ఉండాలి. మేము ప్రజలకు వాట్సాప్ నంబర్‌ను షేర్ చేస్తాం. వారు వీడియోలను ఆ నంబరుకు పంపవచ్చు'' అన్నారు.