Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు సినీ వర్కర్ల కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఇచ్చిన టెండర్ నోటీఫికేషన్ అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర స్టే ఆదేశాలిచ్చింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించేలా నోటిపికేషన్ ఉందంటూ ఎం.రమేష్‌బాబు, ఇతరులు వేసిన పిటిషన్‌ను జస్టిస్ విజరుసేన్‌రెడ్డి విచారించారు.
గత నెల 24న ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా నోటిఫికేషన్ ఉందని పిటిషినర్ వాదనల తర్వాత హైకోర్టు స్టే ఆదేశాలిచ్చింది. విచారణను వచ్చే నెల మూడో వారానికి వాయిదా వేసింది.