Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 20 వేల మందికి గృహవసతి
కొచ్చి : కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం తాను పేదల పక్షపాతినన్న వాస్తవాన్ని మరోసారి నిరూపించుకుంది. నివసించడానికి ఇండ్లు లేని 20,073 కుటుంబాలకు గూడు కల్పించింది. దీంతో 'లైఫ్' మిషన్లో భాగంగా ఇప్పటి వరకూ 3,42,224 మంది లబ్దిదారులకు గృహవసతి కల్పించినట్లయింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలందరికీ గృహవసతి కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం 2016లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
రాష్ట్రంలో మొత్తం 4.32 లక్షల మందికి పక్కా ఇండ్లు లేవని, వీరిలో 1.58 లక్షల మందికి భూమి కూడా లేదని రాష్ట్ర ప్రణాళికా బోర్డు అంచనా వేసింది. వీరిలో 44 వేల మంది శిథిలమైన ఇండ్లలో జీవిస్తున్నారు. బోర్డు అంచనాల తర్వాత లబ్దిదారుల సంఖ్యను 4.72 లక్షలకు పెంచారు. ఈ నెల 4న పేదలకు పక్కా ఇండ్లు నిర్మించి ఇచ్చిన సందర్భంలోనే 41,439 కొత్త ఇళ్ల నిర్మాణానికి ఒప్పందం కూడా జరిగింది. సొంతింటి కలను చాలా మంది సాకారం చేసుకోలేకపోతున్నారని, రాష్ట్రంలో సొంత ఇల్లు లేని వారంటూ ఉండకూడదన్నదే తమ ప్రభుత్వ విధానమని ముఖ్యమంత్రి తెలిపారు. 2022కు ముందే ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్పటికీ కోవిడ్ కారణంగా జాప్యం జరిగింది. రాష్ట్రంలో 68,568 ఇండ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉన్నదని స్థానిక సంస్థల శాఖ మంత్రి, లైఫ్ మిషన్ ఛైర్మన్ ఎంబీ రాజేష్ తెలిపారు. ఇండ్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 16,557.46 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, ప్రాజెక్టులు తమ ఘనతేనంటూ కొందరు బీజేపీ నేతలు గొప్పలు చెప్పుకోవడాన్ని ఆయన ఖండించారు. వివిధ పథకాలలో రాష్ట్ర ప్రభుత్వ వాటాను ఆయన వివరించారు.