Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మలపురం : కేరళలోని మలపురం జిల్లాలో ఆదివారం సాయంత్రం ఒక హౌస్‌బోట్ బోల్తా పడిన మునిగి పోయిన ప్రమాదంలో 15 మంది మరణించారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నారు. జిల్లాలోని తనూర్ ప్రాంతంలో ని తువల్తిరం బీచ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం వార్త తెలిసిన వెంటనే అక్కడకు చేరుకున్న రాష్ట్ర క్రీడల మంత్రి వి అబ్దురహిమాన్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. వేసవి సెలవులు కారణంగా విద్యార్థులు అధికసంఖ్యలో రైడ్‌కు వచ్చారని, అందుకే మృతుల సంఖ్యలో వీరే అధికంగా ఉన్నారని అధికారులు చెప్పారు. ప్రమాదానికి కారణం ఇంకా వెల్లడి కాలేదని, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అధికారులు తెలిపారు.