Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ లా యూనివర్సిటీ వీసీ బాజ్పారు
న్యూఢిల్లీ : రాజద్రోహం అనే పదం అంటేనే మనం రాచరిక పాలనలో జీవిస్తున్నామన్న భావన కలుగుతుందని ఢిల్లీలోని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ జీఎస్ బాజ్పారు వ్యాఖ్యానించారు. విద్వేషాన్ని, హింసను ప్రేరేపించిన తీవ్రమైన కేసులలోనే రాజద్రోహ చట్టాన్ని ఉపయోగించాలని ఆయన చెప్పారు. ఆధునిక భారతావనికి అనువుగా ఉండేలా ఐపీసీ, సీఆర్పీసీ, ఇతర చట్టాలను తిరగరాసేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన నివేదిక ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నదని తెలిపారు. 2010 నుండి ఇప్పటి వరకూ రాజద్రోహ చట్టం కింద 13 వేల మందిపై కేసులు పెట్టారని బాజ్పారు చెప్పారు. అయితే వీరిలో శిక్ష పడిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉన్నదని జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) సమాచారం చెబుతోందని అన్నారు. ముందుగా రాజద్రోహం అనే పదాన్నే మార్చాలని అభిప్రాయపడ్డారు. ఎందు కంటే అది మనం రాచరికంలో ఉన్నామన్న భావన కలిగిస్తోందని వ్యాఖ్యా నించారు. ఈ చట్టం దుర్వినియోగం కాకుండా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇచ్చిందని అన్నారు. ప్రజాస్వామిక దేశంలో ప్రాథమిక హక్కులపై రూపొం దించిన చట్టాలను అమలు చేసేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. విద్వేషాన్ని రెచ్చగొట్టడం, హింసకు పాల్పడడం వంటి చర్యలు తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే రాజద్రోహ చట్టాన్ని అమలు చేయాలని బాజ్పారు సూచించారు.