Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పర్యటనల పేరుతో బీజేపీకి పరోక్ష లబ్ది
- అధికారిక కార్యక్రమాల్లో ప్రధాని తీరు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న అధికారిక యంత్రాంగాలు
- ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలే టార్గెట్
- పీఎం వ్యవహారశైలిపై ప్రతిపక్షాల ఆగ్రహం
- తప్పుబడుతున్న రాజకీయ విశ్లేషకులు
- ఇపుడు కర్నాటకలో మోడీ అధికారిక పర్యటనల సమయం, ఆయన చేసిన ప్రారంభోత్సవాలు, వాటికయ్యే ప్రభుత్వ ఖర్చు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మోడీ పర్యటనలకు అయిన ఖర్చు (పలు వార్త పత్రికల కథనాల ఆధారంగా)
- మోడీ నగర పర్యటనకు సంబంధించి బెంగళూరు పౌర సంఘం రూ.24 కోట్లు ఖర్చు చేసింది.
- మోడీ యోగా దినోత్సవ సందర్శనకు కర్నాటక పుర, నగరపాలక సంస్థలు రూ.56 కోట్లు వెచ్చించాయి.
- కర్నాటకలోని కాల్బుర్గిలో కొన్ని గంటల పర్యటనకు రూ. 11.18 కోట్లు ఖర్చు చేశారు.కర్నాటకలోని కాల్బుర్గిలో కొన్ని గంటల పర్యటనకు రూ. 11.18 కోట్లు ఖర్చు చేశారు.
- ఐఐటీ-ధార్వాడ్ ప్రారంభోత్సవం కోసం రూ. 9.5 కోట్లు వెచ్చించారు.
- ఫిబ్రవరి 27న ప్రధాని పర్యటన సందర్భంగా కర్నాటక ప్రభుత్వం రూ. 36.43 కోట్లు ఖర్చు చేసింది.
- బెలగావిలో ప్రధాని మోడీ ఈవెంట్ కోసం దాదాపు రూ. 14 కోట్లు ఖర్చు అయింది.
జనం సొమ్ముతో సోకులు పడటం ప్రధాని నరేంద్రమోడీకే చెల్లింది. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా అధికార పర్యటనల పేరుతో ఆ రాష్ట్రాల్లో పనిగట్టుకొని పర్యటిస్తూ కాషాయపార్టీకి 'దుర్మార్గ' ప్రచారాన్ని చేకూర్చే దుర్నీతికి పాల్పడుతున్నారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య ఉన్న లక్ష్మణరేఖను చెరిపేస్తున్నారు. చివరకు ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే చోట్లకు కూడా 'అధికార' పర్యటనల పేరుతో ప్రత్యేక విమానాల్లో తిరిగొచ్చి ఓటర్లను ప్రభావితం చేసే చిల్లర ప్రచార చేష్టలకు పాల్పడుతున్నారు. ఆ మధ్య గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) స్థానిక సంస్థల ఎన్నికలైనా, ఇప్పుడు కర్నాటక అసెంబ్లీ ఎన్నికలైనా... ఆయన అధికార దుర్వినియోగ పర్యటనల పరమార్థం ఒక్కటే! ఇప్పటికే ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఆ రాష్ట్రంలోని ప్రముఖుల 'అవతారాలు' ఎత్తుతూ ఓటర్లను పట్టుకొనే ప్రయత్నం చేశారు. తమిళనాడులో లుంగీ కట్టుకుని ప్రచారానికి వెళ్తే, అక్కడి ఓటర్లు దాన్ని లాగిపారేశారు. పశ్చిమబెంగాల్లో రవీంద్రనాధ్ ఠాగూర్ అవతారం ఎత్తి వెళ్తే, అక్కడా కాళ్లు పట్టుకొని లాగేశారు. ఈ పగటి వేషాలతో పనికాదనుకున్నారో ఏమో... ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో అధికార పర్యటనల పేరుతో ప్రజాధనాన్ని కుమ్మరించి, ఓట్లు రాబట్టుకోవాలని తాపత్రయపడుతున్నారు. కానీ కన్నడ ఓటరు దెబ్బకి ఈసారికి కన్ను లొట్టపోతే...ఇంకేం వేషాలేస్తారో వేచిచూడాలి!!
న్యూఢిల్లీ : భారత్ బయోటెక్‌లో కొనసాగుతున్న కోవిడ్-19 వ్యాక్సిన్ ట్రయల్స్‌ను సమీక్షించేందుకు ప్రధాని మోడీ నవంబర్ 29, 2020న కేవలం ఒక గంట పర్యటన కోసం హైదరాబాద్‌కు వచ్చారు. 2020 నవంబర్ 26న ప్రధాని పర్యటన, షెడ్యూల్‌ను హైదరాబాద్ పోలీసులు మీడియాకు మూడు రోజుల ముందు మాత్రమే ధృవీకరించారు. అయితే, మోడీ పర్యటించిన సమయం మాత్రం తీవ్ర చర్చకు దారి తీసింది.
ఆ సమయంలో హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల కోసం అధికార భారత రాష్ట్ర సమితి (అప్పట్లో తెలంగాణ రాష్ట్ర సమితి), ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు దూకుడుగా తలపడుతున్నాయి. అలాంటి సమయంలో మోడీ ఎలాంటి ప్రసంగాలు చేయనప్పటికీ, తెలంగాణలోని టీవీ ఛానెల్‌లు, సోషల్ మీడియా మోడీ పర్యటనపై ఫోకస్ చేశాయి. దీంతో మోదీ 'అధికారిక' పర్యటన బీజేపీకి ఉద్దేశించిన అనధికారిక ప్రయోజనం చేకూర్చినట్టు బీఆర్ఎస్ నాయకులతో పాటు రాజకీయ విశ్లేషకులు అన్నారు. మోడీ నిత్యం ఎన్నికల యావలోనే ఉంటారనేది రహస్యమేమీ కాదని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి పార్లమెంటు ఎన్నికల వరకు.. ప్రతి ఎన్నికలలో కుదిరితే ప్రత్యక్షంగా, కుదరకపోతే పైన పేర్కొన్న విధంగా అధికారిక కార్యక్రమాలను ప్రచార వేదికగా మలచుకుంటారని అన్నారు.
ప్రారంభోత్సవాల 'ప్రచారం'
మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గత తొమ్మిదేండ్లలో ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలలో బీజేపీ ఎన్నికల ప్రచారాల విషయంలో ఆయన అత్యుత్సాహాన్ని ప్రదర్శించారని రాజకీయ విశ్లేషకులు అభి ప్రాయపడుతున్నారు. ప్రత్యేకించి ఎన్నికలకు ముందు నెలల్లోనే అతను అధికారి ప్రారంభో త్సవాల పేరిట పర్యటించి, రాజకీయంగా ర్యాలీలు, సమావేశాలు నిర్వహించి ప్రసంగిం చటం పరిపాటిగా మారింది..
అసెంబ్లీ ఎన్నికలు జరిగే కర్నాటకలో ప్రధాని చేసిన ఈ ప్రారంభోత్సవాలు.. బీజేపీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు అదనం కావట విశేషం. రాష్ట్రమేదైనా ఎన్నికలకు నెలరోజుల ముందు ప్రధాని కచ్చితంగా ప్రారంభోత్సవాలు వంటివి చేస్తుంటారు. బెంగుళూరులోని బయ్య ప్పనహళ్లిలో సర్ ఎం. విశ్వేశ్వరయ్య టెర్మినల్ ప్రారంభోత్సవం దీనికి ఒక ఉదాహరణ. ఇది మార్చి 2021లో సిద్ధంగా ఉన్నదని అధికారు లు పేర్కొన్నప్పటికీ, జూన్ 2022లో ఒక ప్రచార కార్యక్రమంలో మోడీ దీనిని ప్రారంభిం చటం గమనార్హం.
- ఈ ఏడాది మార్చి చివరి వారంలో, బెంగళూరు మెట్రో యొక్క పర్పుల్ లైన్ ప్రారంభోత్సవం పనులు ఇంకా పూర్తి కానప్పటికీ దానిని అధికారిక కార్యక్రమం గా మోడీ మార్చుకున్నారు. బీజేపీ ప్రభు త్వం విస్తృతంగా ప్రచారం చేయడంతో మోడీ అసాధారణ ఆర్భాటాలతో మెట్రో రైడ్‌ను చేపట్టారు. అయితే, పనులు సరి గ్గా జరగకపోవడంతో అందులో చాలా సమస్యలు ఏర్పడ్డాయి.
- బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేను మోడీ ప్రారంభించడం కూడా ఇలాంటి విమర్శలకే దారితీసింది. ప్రచారం జరిగిన మూడు రోజుల తర్వాత, వర్షాల కారణం గా దెబ్బతిన్న ఎక్స్‌ప్రెస్‌వేలోని రోడ్ల ఫోటో లు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.
- దేశ ప్రధాని హౌదాలో అర్హత లేని ప్రాజెక్టులను మోడీ ప్రారంభించడం అనేక సందర్భాల్లో కనిపిస్తోంది. ప్రభుత్వం, పార్టీ సరిహద్దులను చెరిపివేస్తూ అధికారిక, పార్టీ కార్యక్రమాలను ఆయన కలిపి నిర్వ హించిన సందర్భాలు అనేకం ఉన్నాయని విశ్లేషకులు తెలియజేస్తున్నారు.
- బీజేపీ ప్రచారకర్తగా మాండ్యాలో నిర్వహించిన భారీ రోడ్‌షో కోసం అయిన మొత్తం ఎవరు చెల్లించారని కర్నాటకలో ప్రజలు చర్చించుకోవటం చర్చనీయాంశం గా మారింది. అదే రోజు, మోడీ అధికారిక కార్యక్రమం అయిన ధార్వాడ్‌లో ఐఐటీ క్యాంపస్‌ను కూడా ప్రారంభించారు. అయితే బస్వరాజ్ బొమ్మై ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలను ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రజల ను తీసుకువెళ్లడం చర్చకు దారి తీసింది.
కర్నాటకలో ప్రచారం కోసం అధిక సమయం
ఈ సంవత్సరం జనవరి 12 నుంచి ప్రారంభించి, మోడీ ఇప్పటివరకు ఎనిమిది సార్లు కర్నాటకను సందర్శించారు. మార్చి 29న కర్నాటక ఎన్నికల తేదీలను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రకటించకముందే ఆ నెలలో మోడీ రెండుసార్లు రాష్ట్రాన్ని సందర్శి ంచారు. మార్చి 29న ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన తర్వాత కూడా మోడీ కర్నాటకకు తరచుగా పర్యటనలు కొనసాగించారు. టైగర్ ప్రాజెక్ట్‌కు 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా బందీపూర్ టైగర్ రిజర్వ్‌లో వివిధ కార్యక్రమా లను ప్రారంభించేందుకు ఏప్రిల్ 9న ఆయన రాష్ట్రాన్ని సందర్శించారు. ప్రధాని పర్యటన ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమేనని ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శించింది. గతంలో వరదలు ము ంచెత్తినా రాష్ట్రానికి సాయం చేయని మోడీ.. ఇపుడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే కర్నాటకలో పర్యటిస్తు న్నారని ఆరోపించింది.
బొమ్మై నేతత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఐఐటీ-ధార్వాడ్ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవం కోసం ప్రజలను రవాణా చేయడం, భోజనాలు, స్టేజ్ సెటప్‌లు, బ్రాండింగ్, ప్రమోషన్లు, ఇతర లాజిస్టిక్ల కోసం రూ.9.49 కోట్లు ఖర్చు చేసిందని ఆర్టిఐ సమాధానాలు వెల్లడిం చాయి. దీనిపై రాష్ట్రంలోని ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. ప్రజల సొమ్మును అధికారిక కార్యక్రమాల పేరిట సొంత ప్రచారానికి వాడుకోవడమేంటని ప్రశ్నించాయి.
ఆ ఐదు రాష్ట్రాల్లోనూ ఇదే వ్యూహం
త్రిపురలో ఈ ఏడాది ఫిబ్రవరి 16న ఎన్నికలు జరిగాయి. ఎన్నికలకు కొన్ని నెలల ముందు రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణా మాలు కాషాయ పార్టీని ఆందోళనకు గురి చేశాయి. ఎంసీసీ అమల్లోకి రావడానికి దాదా పు నెల రోజుల ముందు డిసెంబర్ 18న మోడీ త్రిపురలో రూ.4,350 కోట్ల విలువైన అభివద్ధి కార్యక్రమాలను ప్రకటించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద రూ. 3,400 కోట్లతో కొత్తగా నిర్మించిన గృహాలను లబ్ధిదారులకు అందించిన 'గహ ప్రవేశ్' కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
అగర్తలా నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి అగర్తలా బైపాస్ (ఖేర్పూర్-అమ్తాలి) విస్తరణ ప్రాజెక్ట్‌ను మోడీ ప్రారంభిం చారు. ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన కింద జాతీయ రహదారి 8ని విస్తరించడం, 232 కి.మీ పొడవుతో 32 రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం వంటి ప్రాజెక్టును కూడా ప్రధానమంత్రి ప్రారంభిం చారు. 542 కిలోమీటర్ల మేర 112 రాష్ట్ర, జిల్లా రహదారుల ప్రాజెక్టులను ఆయన జెండా ఊపి ప్రారంభించారు.
అలాగే, ఇదే ఏడాది ముగిసిన గుజరాత్, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలకు ముందే మోడీ పలు ప్రారంభోత్సవ ప్రచార కార్యక్రమాలు చేశారని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేశారు.
జనం సొమ్ముతో మోడీ సర్కారు అధికారిక కార్యక్రమాలను పార్టీ ప్రచార కార్యక్రమాలుగా మార్చుకోవడం ప్రజా స్వామ్యంలో ఏ మాత్రమూ మంచిది కాదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.