Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంకోర్టుకు మేధావుల వినతి
న్యూఢిల్లీ : బిల్కిస్ బానో అభ్యర్థనపై సత్వరమే విచారణ జరపాలని పలువురు విద్యావేత్తలు, చరిత్రకారులు, హక్కుల కార్యకర్తలు సుప్రీంకోర్టును కోరారు. ఈ మేరకు వారు ప్రధాన న్యాయమూర్తికి బహిరంగ లేఖ రాశారు. జీవితకాల శిక్ష పడిన 11 మంది ముద్దాయిలను గడువుకు ముందే విడుదల చేయడాన్ని బిల్కిస్ బానో న్యాయస్థానంలో సవాలు చేశారు. సుప్రీంకోర్టు ఇలాంటి కేసులను విచారించడానికి అనుమతించకపోతే ఈ దేశంలోని బాధిత మహిళలు ఎవరిని ఆశ్రయిస్తారని మేధావులు తమ లేఖలో ప్రశ్నించారు. 2002లో గుజరాత్లో జరిగిన మత ఘర్షణల సమయంలో 21 సంవత్సరాల గర్భిణి బిల్కిస్ బానోపై 11 మంది కామాంధులు లైంగిక దాడికి తెగబడ్డారు. అంతేకాక 14 మందిని హతమార్చారు. ఈ ఘటనకు సంబంధించి నేరస్తులకు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. అయితే గత సంవత్సరం ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్ష విధానం కింద వారిని విడుదల చేసింది.