Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రేయసీ ప్రియుల ప్రేమ ప్రయాణం ఎంతో మధురంగా ఉంటుంది. ఆటలు ఆడుకోవడం, పాటలు పాడుకోవడం, అంతలోనే అలగడం, మారాము చేయడం, మళ్ళీ ఒకరినొకరు అలకలు మాని కలిసిపోవడం ఇవన్నీ ప్రేమలోని తీయదనాలే కదా! ఇంకా - చుట్టూ ఉన్న సమస్త ప్రకతి తమదేనన్న ధైర్యంతో, స్వేచ్ఛతో సాగిపోతుంటారు ప్రేమికులు. ఆకాశంలో ఉన్న చుక్కల్ని ఒక్క చోట కలిపితే అవి తమ రూపా ల్లాగే ఉంటాయని, దారిలో కనిపించే పూలను జంటగా సాగే తమ అడుగులేనని ఊహించుకుంటారు.
మైమరపింపజేసేది మనసులను రంజింపజేసేది ప్రేమ. అది ఎద ఎదలో వింత గిలిగింతల్ని, సరికొత్త కవ్వింతల్ని కలిగించేది. ప్రేమికుల హృదయాల్లో తీయగా మ్రోగే మహౌన్నత మంత్రధ్వానం ప్రేమ. అలాంటి మహిమాన్వితమైన ప్రేమను గురించి ఎంత చెప్పినా తరగదు. నిజం చెప్పాలంటే ప్రేమను గురించి చెప్పేందుకు మాటలే లేవు. మౌనగానఝురియే ప్రేమ. ప్రేమ చిగురించేదాకా మన జీవనసరళి వేరు. ప్రేమ మొగ్గ తొడిగిన తర్వాత మనసుల్లో మొదలయ్యే వింత అల్లరి, సాగే జీవనసరళి వేరు. ప్రేమికుల మనసుల్లో ప్రేమ ఎదుగుతున్న కొద్దీ కలిగే ఊహలు కొండంత ఉత్సాహాన్నిస్తాయి. ఒకరంటే ఒకరికి అవ్యక్తమైన అనురాగం ఏర్పడినప్పుడు ప్రారంభమయ్యే వలపుకథ ఎలా ఉంటుందో చెబుతూ 'నేను లోకల్' (2017) అనే సినిమాలో శ్రీమణి ఒక పాట రాశాడు. ఆ పాటను ఇప్పుడు చూద్దాం.
తనలో కలిగిన పరవశానికి కారణం కథానాయికయే అని గుర్తించిన కథా నాయకుడు ఆమెను ప్రేయసిగా భావిస్తాడు. కథానాయిక మొదట నిరాకరించినా ఆ తర్వాత అతని ప్రేమను స్వీకరిస్తుంది. తన మనసునూ కానుకగా అందిస్తుంది. అందుకే తన ప్రాణం ఎక్కడీ అనే ప్రశ్నకు తన ప్రేయసినే సమాధానంగా చూపిస్తానని అంటాడు ప్రేమికుడు. మరి తన ప్రియుడితో కలిసి చేసే వలపు పయనమెప్పుడనే ప్రశ్నకు ఆ ప్రేయసి ప్రస్తుతం సాగే ఇరువురి గమనమే సమాధానమని చెప్పడం చాలా బాగుంది. ఇద్దరి మనసుల్లో ప్రేమ చేసిన కొంటె అల్లరే ఆ ప్రశ్నల్ని వేయించింది. జవాబుల్నీ చెప్పించింది. మాటల్నే మరిచే ఆనందాలవేళ ఇది. హాయిగా ప్రేమగీతాల్ని పాడుకోవడం తప్ప ఇంకేది ఆ సమయంలో జంటకు గుర్తుండదు. ఈ పులకింతలకు కారణం ప్రేమ కదా!
ప్రేయసీప్రియుల ప్రేమ ప్రయాణం ఎంతో మధురంగా ఉంటుంది. ఆటలు ఆడుకోవడం, పాటలు పాడుకోవడం, అంతలోనే అలగడం, మారాము చేయడం, మళ్ళీ ఒకరినొకరు అలకలు మాని కలిసిపోవడం ఇవన్నీ ప్రేమలోని తీయదనాలే కదా! ఇంకా - చుట్టూ ఉన్న సమస్త ప్రకతి తమదేనన్న ధైర్యంతో, స్వేచ్ఛతో సాగి పోతుంటారు ప్రేమికులు. ఆకాశంలో ఉన్న చుక్కల్ని ఒక్క చోట కలిపితే అవి తమ రూపాల్లాగే ఉంటాయని, దారిలో కనిపించే పూలను జంటగా సాగే తమ అడుగులేనని ఊహించుకుంటారు. తామే మబ్బుల్లో చినుకులైపోయినట్టుగా, వారు వెళ్ళే ప్రతి చోట ఓ పూలతోట విరిసినట్టుగా భావిం చుకుంటారు. చుక్కల్ని కలిపితే తమ బొమ్మలు కనిపించడం, మబ్బుల్లో చినుకుల వ్వాలనుకోవడం మొదలైనవన్నీ అసాధ్యాలై నప్పటికీ వారికున్న ప్రేమబలమే ఆ అసాధ్యాల్ని సుసాధ్యం చేయిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తపరుస్తుంది.
చూపులతో ముద్దాడుకోవడం నేర్చు కొమ్మని ప్రేమికుడు ప్రియురాలితో అంటాడు. అప్పుడామె - పెదవులతో పెదవులకు ముద్దుపెట్టమని అడిగే అలవాటు తనకు లేదని, ఆ అలవాటును మార్చమని అడుగుతుంది. అంటే - తన వయసుకు ఇన్నాళ్ళు ప్రేమ గాలి తగలలేదు కాబట్టి ఆమెకు ఆ సంగతులు తెలియవు. ఇక నీ రాకతో ఆ వలపుదనం తనకు అలవాటు కావాలని ఆమె పరో క్షంగా చెబుతుందని అర్థం. ప్రేమికుడు ఆమె కళ్ళకు కాటుకను దిద్దే వేలవుతానని అంటే, ఆ వేలు పట్టుకుని తనతో ఏడడు గులు నడిచే వేళ ఎప్పుడొ స్తుందా అని ఆమె ఎదురుచూస్తున్నానని చెబుతుంది. అంటే తనతో ముడిపడబోయే మధురమైన జీవితాన్ని తలచుకుని మురిసిపోతోందని అర్థం.
ఇలా ప్రేమికుల ఎదలో సాగే వలపుల లాహిరులను గూర్చి ఎంతో అద్భుతంగా చెప్పాడు శ్రీమణి. పరవళ్ళు తీసిన అందమైన అనురాగానికి వ్యాఖ్యానంలాంటిదీపాట.
... పాట ...
అరెరే ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం / ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం / అరెరే ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు నీతో నా పయనం / ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం / మాటల్నే మరిచే సంతోషం / పాటల్లే మారింది ప్రతీ క్షణం.
నింగిలో ఆ చుక్కలన్నీ ఒకటిగా కలిపితే మన బొమ్మ కాదా /
హౌ.. దారిలో ఈ పువ్వులన్నీ జంటగా వేసిన మన అడుగులేగా /
మబ్బుల్లో చినుకులు మనమంటా / మనమే చేరేటి చోటేదైనా అయిపోద పూదోట.
ఓ కళ్ళతో ఓ చూపు ముద్దే ఇవ్వడం నేర్పుతా నేర్చుకోవా /
ఆ పెదవితో పెదవులకి ముద్దే అడగడం తెలియని అలవాటు మార్చవా / కాటుకనే దిద్దే వేలవుతా / ఆ వేలే పట్టి ఏ వేళ నీ వెంట అడుగేస్తా.
- తిరునగరి శరత్ చంద్ర,
6309873682