Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : గడిచిన ఆర్థిక సంవత్సరం (2022-23) మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 144.4 శాతం వృద్ధితో రూ.309.50 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం 2021-22 ఇదే సమయంలో రూ.126.52 కోట్ల లాభాలు నమోదు చేసింది. 2022-23లో మొత్తంగా రూ.1,099.92 కోట్ల నికర లాభాలు ఆర్జించింది. ప్రతీ రూ.10 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేర్‌పై రూ.0.5 డివిడెండ్‌ను ప్రకటించింది. 2021-22లో ఈ సంస్థ రూ.414.58 కోట్ల నష్టాలు చవి చూసింది. 2023 మార్చి నాటికి స్థూల రుణ పుస్తకం 33 శాతం పెరిగి రూ.24,085 కోట్లకు చేరింది.