Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నయ్ : దేశీయంగా ట్రాక్టర్ అమ్మకాల్లో పతనం చోటు చేసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ తగ్గడంతో ఏడాదికే డాదితో పోల్చితే గడిచిన ఏప్రిల్ లో ట్రాక్టర్ విక్రయాలు 11 శాతం క్షీణించి 79,288 యూనిట్లుగా చోటు చేసుకున్నాయి. 2012 ఇదే మాసంలో 89,201 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. 2023 మార్చిలోనూ 82,856 యూనిట్ల అమ్మకాలు జరగ్గా.. దీంతో పోల్చిన గడిచిన నెల డిమాండ్లో తగ్గుదల చోటు చేసుకుంది. 2023 ఏప్రిల్లో మహీంద్రా అండ్ మహీంద్రా ట్రాక్టర్ అమ్మకాలు 10 శాతం తగ్గి 35,938 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఎస్కార్ట్స్ కుబొటా ట్రాక్టర్ల అమ్మకాలు 5.5 శాతం తగ్గి 7,252 యూనిట్లుగా నమోదయ్యాయి. ప్రస్తుత 2023-24 ఆర్థిక సంవత్సరంలో ట్రాక్టర్ పరిశ్రమ ఒక్క అంకె వృద్ధితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చేలా ఉందని ఆ రంగం వర్గాలు అంచనా వేస్తున్నాయి.