Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : రాధాకిషన్ దామానికి చెందిన డిమార్ట్ లాభాలు మరింత పెరిగాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం 2022-23 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో డిమార్ట్ మాతృసంస్థ అవెన్యూ సూపర్మార్ట్స్ 8.33 శాతం వృద్థితో రూ.505.21 కోట్ల నికర లాభాలు గడించింది. ఇంతక్రితం ఏడాది ఇదే క్యూ4లో రూ.466 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.8,606 కోట్లుగా ఉన్న రెవెన్యూ.. క్రితం క్యూ4లో 21.11 శాతం వృద్థితో రూ.10,337.12 కోట్ల రెవెన్యూ నమోదు చేసింది. ఎఫ్ఎంసిజి విభాగం అమ్మకాల్లో మెరుగైన ప్రగతిని నమోదు చేశామని అవెన్యూ సూపర్మర్ట్స్ సిఇఒ, ఎండి నెవిల్లీ నొరొన్హా పేర్కొన్నారు. శుక్రవారం డిమార్ట్ షేర్ విలువ 0.62 శాతం తగ్గి రూ.3,680.25 వద్ద ముగిసింది. ఈ దఫా లాభాలు పెరిగినప్పటికీ.. పలు ఎజెన్సీల అంచనాలను చేరలేకపోయింది.