Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : కొత్త గ్రాడ్యుయేట్లు మరియు పోస్టు గ్రాడ్యుయేట్లకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచేందుకు భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఐటిఇ &సి శాఖ పరిధిలో లాభాపేక్ష లేని సంస్థతెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (TASK) నేడు ఒక ఒప్పందంపై (MoU) సంతకాలు చేసుకున్నాయి. ఒప్పందం ప్రకారం, హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఇప్పుడు ‘టాస్క్’తో రిజిస్ట్రరు అయిన 700 సంస్థలలోని అతి పెద్ద ప్రతిభావంతుల సమూహాన్ని యాక్సెస్ చేయగలరు. ఈ ఒప్పందంపై నేడు హైదరాబాద్‌లో టాస్క్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా మరియు హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో టాలెంట్ అక్విజిషన్ హెడ్ రంగ సుబ్రమణియన్, మరియు తెలంగాణ ప్రభుత్వ టాస్క్ అధికారుల సమక్షంలో సంతకాలు చేశారు. హెచ్డీఎఫ్సీ బ్యాంకు ద్వారా శిక్షణ పొందిన విద్యార్థులకు టాస్క్ సహాయాన్ని అందిస్తుంది. ప్లేస్మెంట్ డ్రైవ్‌లు, ఇంటర్వ్యూలకు అన్ని రకాల లాజిస్టికల్ మద్దతును టాస్క్ అందజేస్తుంది. ‘‘హెచ్డీఎఫ్సీ బ్యాంక్ దేశ వ్యాప్తంగా తాజా ప్రతిభను ప్రోత్సహించేందుకు కట్టుబడి ఉంది. మేము ఒక సమాన అవకాశాలను కల్పించే సంస్థగా, ఇక్కడ ప్రతి ఒక్కరూ తమ ప్రతిభను మరియు వారి గరిష్ఠ సామర్థ్యానికి ఎదిగేందుకు టాస్క్‌తో కలిసి పర్యావరణ వ్యవస్థను సమకూర్చుతుంది. ఈ భాగస్వామ్యం లక్షలాది మందికి ఆర్థిక సాధికారత కల్పిస్తూ, దేశ నిర్మాణానికి సహకరిస్తున్న సర్టిఫైడ్ ‘గ్రేట్ ప్లేస్ టు వర్క్’లో వారి కెరీర్‌ను ప్రారంభించేందుకు జెన్ జీకి తలుపులు తెరుస్తుంది’’ అని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ టాలెంట్ అక్విజిషన్ హెడ్ రంగ సుబ్రమణియన్తెలిపారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1,70,000 కన్నా ఎక్కువ మంది క్రియాశీల ఉద్యోగులతో దేశంలోని అతిపెద్ద యాజమాన్య సంస్థలలో ఒకటిగా ఉంది.