నవతెలంగాణ-నిజామాబాద్ : నగరంలోని వినాయకనగర్, న్యూ హౌజింగ్ బోర్డ్ కాలనీ లో... తాళం వేసిన ఇంట్లో దొంగలు గురువారం రాత్రి చోరీ కి పాల్పడ్డారు. శుక్రవారం ఇంటికి వచ్చిన బాధితులు గేట్ తాళం తీసి చూడగా ఇంటి తాళం పగులగొట్టి ఉండటం చూసి నాలుగవ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ ఐ సందీప్ అక్కడికి చేరుకొని వివరాలు సేకరించాగా, క్లూస్ టీమ్ ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు. దొంగలు ఇంట్లోని బీరువా పగులగొట్టి 5 తులాల వెండి గొలుసులు, రెండు సంచుల బియ్యం , ఒక పరుపు, వంటింటి కొంత సామాను ఎత్తుకెళ్లినట్టు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. కాలనీలో పోలీసులు గస్తీ పెంచాలని కాలనీ వాసులు కోరుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm