నవతెలంగాణ-బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్న కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివ కుమార్ జన్మదిన వేడుకలు ఆదివారం రాత్రి జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ సీనియర్ నేత, సీఎం పదవి కోసం పోటీ పడుతున్న సిద్ధరామయ్య కూడా హాజరయ్యారు. ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థిని ఎంపిక చేసే అధికారాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అప్పగిస్తూ కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం మే 18న జరుగుతుందని తెలుస్తోంది. డీకే శివ కుమార్ ఆదివారం రాత్రి 11.40 గంటలకు ఇచ్చిన ట్వీట్లో మే 15న తన జన్మదినోత్సవమని, కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య, ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి తన పుట్టిన రోజును జరుపుకున్నానని తెలిపారు. తన జీవితం కర్ణాటక ప్రజలకు సేవ చేయడానికి అంకితమైందని చెప్పారు. తన జన్మదినోత్సవాల సందర్భంగా కర్ణాటక ప్రజలు తనకు అత్యుత్తమమైన బహుమతిని ఇచ్చారని తెలిపారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ కుటుంబానికి ధన్యవాదాలు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm