నవతెలంగాణ-హైదరాబాద్ : ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసానికి సీపీఐ నేత డి.రాజా వెళ్లారు. ప్రస్తుత దేశ రాజకీయాలు, బీజేపీకి ప్రత్యామ్నాయాలపై ఇరువురూ చర్చించారు. అనంతరం మీడియాతో శరద్ పవార్ మాట్లాడుతూ... కర్ణాటకలో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ ను ప్రశంసించారు. కర్ణాటక వ్యూహాలను ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయాల్సిన అవసరం ఉందని... దీని కోసం భావసారూప్యత కలిగిన పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని అన్నారు. కర్ణాటకలో బీజేపీపై కాంగ్రెస్ ఒంటరిగానే పోరాడిందని... ఇతర రాష్ట్రాల్లో విపక్ష పార్టీలు కలిసి ముందడుగు వేయాలని చెప్పారు. 2024లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని డి.రాజా జోస్యం చెప్పారు. బీజేపీ పతనం ప్రారంభమయిందని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm