నవతెలంగాణ - ఢీల్లి: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో 500 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపింది. భారత దేశంలో వివిధ స్థాయులలో పనిచేస్తున్న ఈ ఉద్యోగులకు మంగళవారం పింక్ స్లిప్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న సంస్థ ఉద్యోగులలో 18 వేల మందిని తొలగించనున్నట్లు అమెజాన్ ఈ ఏడాది జనవరిలో ప్రకటించింది. దశలవారీగా తొలగింపులు చేపడతామని వివరించింది. ఈ కామర్స్ రంగంలో మందగమనం కారణంగా మానవ వనరులను తగ్గించుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొంది. ఇందులో భాగంగా 9 వేల మంది ఉద్యోగులను తీసేయాలని నిర్ణయించినట్లు సంస్థ సీఈవో అండీ జెస్సీ మార్చిలో ప్రకటించారు.