నవతెలంగాణ-బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. విజయాల్లో మూడు పార్టీలు ఖాతా తెరవగా.. కాంగ్రెస్ దూకుడు కొనసాగుతోంది. మధ్యాహ్నం 12 గంటల వరకు వెలువడిన ఫలితాల సరళిని చూస్తే.. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ 16 స్థానాల్లో విజయం సాధించి.. మరో 107 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక బీజేపీ నాలుగు చోట్ల గెలిచి 64 స్థానాల్లో ముందంజలో ఉంది. జేడీఎస్ 1 స్థానంలో విజయం సాధించి.. 25 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు మరో 7 చోట్ల మందంజలో ఉన్నారు.
కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డి.కె. శివకుమార్ కనకపుర స్థానం నుంచి విజయం సాధించారు.
ఎల్లాపురా స్థానంలో బీజేపీ అభ్యర్థి శివరామ్ గెలుపొందారు.
హసన్ నియోజకవర్గంలో జేడీఎస్ నేత స్వరూప్ విజయం సాధించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 13 May,2023 12:08PM