నవతెలంగాణ-హైదరాబాద్ : కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 122 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. పార్టీకి క్లియర్ మెజారిటీ వస్తుందని స్పష్టం కావడంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. రాష్ట్రంలో 120 స్థానాలకు పైగా గెలుచుకుంటామని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, తమకు ఎవరి మద్దతూ అవసరం లేదని చెప్పారు. బీజేపీపై, ఆ పార్టీ అవినీతి పాలనపై ప్రజలు విసిగిపోయారని అన్నారు. కర్ణాటకలో మత రాజకీయాలు పనిచేయలేదని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు.
Mon Jan 19, 2015 06:51 pm