నవతెలంగాణ - కర్ణాటక: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో ఉండటంతో ఆ పార్టీ సంబరాల్లో మునిగింది. కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే మాజీ సీఎం సిద్ధరామయ్య మరోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇలాంటి తరణంలో సిద్ధరామయ్య ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. సిద్ధరామయ్య సోదరి శివమ్మ భర్త రామే గౌడ (69) ఆకస్మికంగా మరణించారు. రామే గౌడ ఈ ఉదయం అస్వస్థతకు గురికావడంతో నగరంలోని జేఎస్ఎస్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స అందిస్తుండగా ఉదయం 8.30 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm