నవతెలంగాణ-హైదరాబాద్ : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. పదవ తరగతి ఫలితాల తర్వాత మొదటి శని, ఆదివారాలు కావడంతో భక్తులు భారీగా తిరుమలకు వస్తున్నారు. సర్వదర్శనానికి క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్ని నిండి క్యూ లైన్లు వెలుపలకు వచ్చాయి. సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది. కాగా శనివారం సాయంత్రానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు సర్వదర్శనం (టోకెన్ రహిత) భక్తులతో నిండిపోయి క్యూలైన్ ఎంబీసీ వరకు వ్యాపించింది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.08 కోట్ల రూపాయలు వచ్చింది. 87,007 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. 43,022 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm