నవతెలంగాణ-హైదరాబాద్ : మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం వెంకటాయపల్లి గ్రామ రైల్వే గేట్ సమీపంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటాయ పల్లి గ్రామానికి చెందిన సంకటి రాజమల్లయ్య కుమారుడు సంకటి శివ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm