నవతెలంగాణ-హైదరాబాద్ : శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ ,శ్రీ లక్ష్మీ శ్రీనివాస ఫిలిమ్స్, క్రియేటివ్ థింగ్స్ గ్యాంగ్ బ్యానర్లు కలిసి చేస్తున్న సినిమా 'చెట్టు మీద దెయ్యం నాకేం భయం'. తల్లాడ సాయికృష్ణ హీరో గా, మాధురి చిగురు హీరోయిన్ గా చేస్తున్న హారర్ కామెడీ సినిమా ఇది. ఈ సినిమా 1స్ట్ లుక్ ని చిత్ర బృందం మదర్స్ డే సందర్భంగా విడుదల చేసారు. ఈ సందర్భంగా తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ నేను చేసే ప్రతి సినిమా టైటిల్ ప్రేక్షకులకు చాలా దగ్గరగా ఉన్న పేరు నే తీసుకుంటాను. అలానే మనం చిన్నప్పటి నుండి వింటున్న టైటిల్ ఇది, హారర్ కామెడీ అంశాలు జోడించి సినిమా తీయడం జరిగింది. ఇటీవల విడుదలైన నమస్తే సేట్ జీ సినిమా కి వచ్చిన రెస్పాన్స్ ఈ సినిమా కి కూడా వస్తుంది , అలానే మా టీం మెంబర్స్ చాలా ఎఫర్ట్ చేసి సినిమా ని తెరకెక్కిస్తున్నారు. హీరోయిన్ మాధురి చిగురు మాట్లాడుతూ హీరోయిన్ అంటే కేవలం పాటల కి మాత్రానికే కాకుండా నా యాక్టింగ్ కి చాలా స్కోప్ ఉన్న కథ ఇది. దాదాపు 38 రోజులు షెడ్యూలు షూట్ చేశారు, ఈ మధ్య అసలు హారర్ కామెడీ నేపథ్యంలో సినిమాలు రాలేదు, మా సినిమా పక్క అందరికి నచ్చుతుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు.
డైరెక్టర్ జానీ మాట్లాడుతూ..
సాయికృష్ణ చేసే ప్రతి ప్రాజెక్టు ఏదొక మెసేజ్ ఉంటుంది, అలానే ఈ సినిమా లో కూడా మంచి థీమ్ ఉంది, నన్ను డైరెక్టర్ గా భాగస్వామ్యం చేసిన మా సాయికృష్ణ కి కృతజ్ఞతలు. ఈ సినిమా కి కథ మాటలు- శివ కాకు, నిర్మాత- తల్లాడ శ్రీనివాస్, స్క్రీన్ ప్లే & డైరెక్టర్- తల్లాడ సాయికృష్ణ, దర్శకత్వ పర్యవేక్షణ- జానీ,కెమెరా- ఆర్.ఎస్ శ్రీకాంత్, శ్యామ్ కందుల, ఫైట్ మాస్టర్- శ్యామ్ కరద, ఎడిటింగ్- వివేకానంద విక్రాంత్, పబ్లిసిటీ డిజైన్స్- రాహుల్,కో-ప్రొడ్యూసర్- అశోక్ నిమ్మల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్- విజయ్ నిట్టల,సాయి మణికంఠ, గౌతమ్ పొట్టిముతి,కుంచపర్తి సాయికుమార్,ప్రొడక్షన్ ఇంచార్జ్- సయ్యద్ ఉద్దండ, ప్రసాద్ విరవేల్లి పి.ఆర్.ఓ- పవన్ పాల్.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 14 May,2023 12:19PM