నవతెలంగాణ-హైదరాబాద్ : నంద్యాల జిల్లా అవుకు జలాశయంలో ప్రమాదం చోటుచేసుకుంది. పడవ బోల్తా పడి 12 మంది గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకూ ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగతావారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పర్యాటకులంతా తంజావూరుకు చెందినవారిగా భావిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
Mon Jan 19, 2015 06:51 pm