నవతెలంగాణ - కాకినాడ: ఘోర రోడ్డు ప్రమాదం. తాళ్లరేవు మండలం సీతారామపురం సుబ్బరాయుని దిబ్బ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారందరూ మహిళలే. ఓ ఆటోను ప్రైవేటు బస్సు ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మహిళలు ఓ రొయ్యల పరిశ్రమలో పనిచేసి ఆటోలో తిరిగి వస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది.
Mon Jan 19, 2015 06:51 pm