నవతెలంగాణ - న్యూఢిల్లీ : మదర్స్ డే సందర్భంగా సోషల్ మీడియాలో నెటిజన్లు తమ తల్లులతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేస్తూ అమ్మతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఇక కార్పొరేట్ దిగ్గజం ఆనంద్ మహీంద్ర సైతం ఈ ట్రెండ్‌లో జాయిన్ అయ్యారు. తన తల్లి ఇందిరాతో తాను కలిసిఉన్న పాత ఫొటోను షేర్ చేశారు. తల్లితో ఆనంద్ మహీంద్ర చిన్ననాటి ఫొటోపై నెటిజన్లు పెద్దసంఖ్యలో రియాక్టయ్యారు.
ఈ ఫొటోలో కంపెనీ వాటాదారుల సమావేశంలో చిన్నారి ఆనంద్ మహీంద్ర పక్కన ఇందిరా మహీంద్రా కూర్చుని ఉండటం కనిపిస్తుంది. ప్రతి ఏటా మదర్స్ డే రోజున తాను తన తల్లి పాత ఫొటోలను వెలికితీస్తుంటానని, ఈసారి గతం నుంచి ఈ అద్భుత ఫొటో ముందుకొచ్చిందని, ఈ ఫొటోను ట్విట్టర్లో షేర్ చేస్తూ పారిశ్రామిక దిగ్గజం రాసుకొచ్చారు. ఈ ఫొటో తన తండ్రి అధ్యక్షతన జరిగిన మహీంద్ర ఉజైన్ స్టీల్ వార్షిక వాటాదారుల సమావేశానికి తన తల్లి తనను తొలిసారిగా తీసుకువచ్చిన సందర్భంలోనిదని పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 14 May,2023 04:16PM