నవతెలంగాణ-హైదరాబాద్ : కర్ణాటక అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యేదెవరంటూ జోరుగా చర్చలు జరుగుతున్నాయి. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మధ్య ఈ విషయంలో పోటీ నెలకొంది.
సీఎం పదవికి డీకే అర్హుడంటూ ఒక్కలిగల గురువు ఆది చంచనగిరి నిర్మలానందనాథ స్వామీజీ తాజాగా వ్యాఖ్యానించారు. ఆయనను సీఎం చేయాలని కాంగ్రెస్కు సూచించారు. నిన్న జరిగిన ఒక్కలిగల గురువుల సమావేశంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు. సోనియాగాంధీ, రాహుల్, మల్లికార్జున ఖర్గే, సిద్ధరామయ్యలకు ఈ మేరకు విజ్ఞప్తి చేయాలని సమావేశంలో తీర్మానించినట్టు నిర్మలానంద తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 15 May,2023 06:57AM