నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీ విద్యార్థులకు బిగ్ అలర్ట్. నేటి నుంచి ఈఏపీసెట్ పరీక్షలు.. జరుగనున్నాయి. ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్-2023 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి ఈ నెల 19 వరకు ఇంజనీరింగ్ విభాగం..22, 23 తేదీల్లో అగ్రి, ఫార్మసీ విభాగాల్లో పరీక్ష జరగనుంది. ఉదయం 9 నుంచి 12, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు ఎగ్జామ్స్ ఉంటాయని, నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించమని అధికారులు స్పష్టం చేశారు. పరీక్షా సెంటర్ కు 30 నిమిషాల ముందే.. చేరుకోవాలని అధికారులు వెల్లడించారు. అలా కాకుండా లేట్ గా వస్తేౌ పరీక్షకు అనుమతి ఇవ్వబోమని హెచ్చరించారు అధికారులు.
Mon Jan 19, 2015 06:51 pm