Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షావోమి వెల్లడి
న్యూఢిల్లీ : స్మార్ట్ఫోన్, స్మార్ట్ టివి బ్రాండ్ షావోమి తమ ఉత్పత్తులకు సంబంధించి వయోవృద్ధులకు ఇంటి వద్దనే సర్వీసు మద్దతును అందించనున్నట్లు తెలిపింది. వారి కోసం ప్రత్యేకమైన ఎట్-హోమ్ ఫోన్ సపోర్ట్ సేవలను ప్రవేశపెట్టినట్లు పేర్కొంది. వినియోగదారులు 1800 103 6286 నెంబర్కు ఫోన్ చేయడం లేదా 8861826286 వాట్సాప్ ద్వారా తమను సంప్రదించవచ్చని పేర్కొంది. తమ సమీప సర్వీస్ సెంటర్కు 20 కిలోమీటర్ల లోపున నివసిస్తున్న సీనియర్ సిటిజన్లకు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. తొలుత హైదరాబాద్ సహా 15 నగరాల్లో ఈ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది.