Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓఎంఐ ఫౌండేషన్ ఈజ్ ఆఫ్ మూవింగ్ ఇండెక్స్ (EoMI) ఇండియా రిపోర్ట్ 2022
- ఈజ్ ఆఫ్ మూవింగ్ ఇండెక్స్ 2022 నుంచి కొత్త డేటా భారతదేశ మొబిలిటీ ప్యాటర్న్లకు సంబంధించి కొత్త దృష్టి కోణాన్ని అందిస్తుంది
- ఈజ్ ఆఫ్ మూవింగ్’ అనేది ఐక్యరాజ్యసమితి, భారత ప్రభుత్వంలోని గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వరుసగా ప్రతిపాదించిన ‘సుస్థిర అభివృద్ధి’ మరియు ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ అనే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భావనలపై ఆధారపడింది.
- ఈజ్ ఆఫ్ మూవింగ్ ఇండెక్స్ (EoMI) నగరంలో మొబిలిటీ స్థితిపై స్కోర్‌కార్డ్‌ను అందిస్తుంది. ఇది వారి మొబిలిటీ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు నగరాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని వృద్ధి చేస్తుంది.
- భారతదేశంలో అర్బన్ మొబిలిటీ భద్రత, యాక్సెసిబిలిటీ, విశ్వసనీయత మరియు స్థాయిని మెరుగుపరిచే మొబిలిటీలో డేటా ఆధారిత నిర్ణయాన్ని తీసుకునేందుకు నివేదిక సహకరిస్తుంది.
నవతెలంగాణ - హైదరాబాద్
ఓఎంఐ ఫౌండేషన్ సిద్ధం చేసిన ఈజ్ ఆఫ్ మూవింగ్ ఇండెక్స్ - ఇండియా రిపోర్ట్ 2022ను స్మార్ట్ సిటీస్ మిషన్, మిషన్ డైరెక్టర్ మరియు జాయింట్ సెక్రటరీ, ఐఏఓస్ అధికారి కునాల్ కుమార్, మరియు భారతదేశంలోని యూఎన్ రెసిడెంట్ కోఆర్డినేటర్ షోంబి షార్ప్ సంయుక్తంగా ఈ నివేదికను విడుదల చేశారు. ప్రయాణికుల అవగాహనను అర్థం చేసుకుని యాక్టివ్ మరియు షేర్డ్ మొబిలిటీ ఎంపికలను హైలైట్ చేసే సమగ్ర మొబిలిటీ ఇండెక్స్‌ను అభివృద్ధి చేసినందుకు ఓఎంఐ ఫౌండేషన్‌లోని బృందాన్ని మంత్రి అభినందించారు.
ఈజ్ ఆఫ్ మూవింగ్ ఇండెక్స్ (EoMI) - ఇండియా రిపోర్ట్ 2022 సమీక్షకు 50,488 మంది స్పందించగా, 220 ఎఫ్‌జీడీ ఫోకస్ గ్రూప్ డిస్కషన్ పార్టిసిపెంట్లు మరియు ప్రభుత్వం మరియు ఇతర వనరుల నుంచి సేకరించిన డేటాతో ఇది భారతదేశంలో నిర్వహించిన అతిపెద్ద సర్వే ఆధారంగా రూపొందించబడింది. ఈ నగరాలలోని పలు ప్రాంతాలలో 9 అంశాలను పరిగణనలోకి తీసుకుని 41 సూచికలుగా సంకలనం చేయబడిన 100 ఎక్కువ ఉప-సూచికలను తెలియజేస్తుంది. ఈజ్ ఆఫ్ మూవింగ్ ఇండెక్స్ (EoMI) యాక్సెసిబిలిటీ మరియు ఇన్క్లూసివిటీ అంశాలకు ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, ‘‘మొబిలిటీ ఫర్ ఆల్’’ అనేది అభివృద్ధి చెందుతున్న మరియు శక్తివంతమైన క్రియాశీల మరియు భాగస్వామ్య మొబిలిటీ పర్యావరణ వ్యవస్థకు మూలస్తంభంగా ఉండవలసిన అవసరాన్ని గుర్తిస్తుంది. ఈజ్ ఆఫ్ మూవింగ్ ఇండెక్స్ (EoMI) 2022 నివేదిక ప్రకారం, యాక్టివ్ మరియు షేర్డ్ మొబిలిటీని స్వీకరించేందుకు కొచ్చి ముందంజలో ఉండగా, భువనేశ్వర్ వేగవంతమైన మొబిలిటీ అనుభవాన్ని అందించడంలో ఉజ్వలంగా ఉంది. క్లీన్ మొబిలిటీలో ఐజ్వాల్ టాప్ పెర్ఫార్మర్గా అవతరించగా, జబల్పూర్ తక్కువ మొబిలిటీ ఖర్చును కలిగి ఉంది. షేర్డ్ మొబిలిటీను అలవర్చుకోవడంలో కోల్‌కతా ముందంజలో ఉండగా పుణె అత్యంత సమగ్ర మొబిలిటీ పర్యావరణ వ్యవస్థను కలిగి ఉంది.
‘‘పట్టణ కేంద్రాలు దేశంలో ఆర్థిక వృద్ధికి కారకాలు మరియు మొబిలిటీ అనేవి పౌరులు తమ నిజమైన సామర్థ్యాన్ని గ్రహించుకుని వారిని శక్తివంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. భారతదేశం ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా, అంతకు మించిన ప్రయాణం స్థిరమైన, ఇంక్లూజివ్, సమర్థవంతమైన మొబిలిటీ వ్యవస్థ ద్వారా ఆజ్యం పోయాలి’’ అని ఓఎంఐ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ మరియు చైనాలో భారత మాజీ రాయబారి గౌతమ్ బంబావాలే పేర్కొన్నారు.
‘‘యాక్టివ్ మరియు షేర్డ్ మొబిలిటీ ఎంపికలు స్థిరమైన మొబిలిటీ కీలక ఎనేబుల్స్లో ఒకటిగా ఉద్భవించగా, ఇది సాంకేతిక ఆవిష్కరణలతో కలిసినప్పుడు భారతీయ నగరాలు ఎలా చలిస్తున్నాయో విప్లవాత్మకమైన వాగ్దానాన్ని అందిస్తాయని’’ ఓఎంఐ ఫౌండేషన్ ట్రస్టీ హరీష్ అబిచందానీ తెలిపారు. ‘‘ఈజ్ ఆఫ్ మూవింగ్ ఇండెక్స్ - ఇండియా రిపోర్ట్ 2022 అనేది విధాన రూపకర్తలకు సహాయం చేసేందుకు ఓఎంఐ ఫౌండేషన్ చేస్తున్న విశిష్ట ప్రయత్నం, ఎందుకంటే భారతదేశం సస్టెయినబుల్ మరియు ఇంక్లూజివ్ మొబిలిటీ వ్యవస్థ వైపు కదులుతున్నందున వారు నిర్ణయం తీసుకునేందుకు డేటా ఆధారిత విధానాన్ని అవలంబించారు’’ అని ఓఎంఐ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఐశ్వర్య రామన్ పేర్కొన్నారు.
ఈజ్ ఆఫ్ మూవింగ్ ఇండెక్స్ (EoMI) 2018 మరియు 2022 మధ్య పౌరుల నివేదించబడిన మొబిలిటీ నమూనాలు మరియు అవగాహనల నుంచి కీలకమైన ఇన్సైట్ల పోలికను కూడా అందిస్తుంది. రెండు ఎడిషన్లలో కవర్ చేయబడిన 18 నగరాల్లో, 9 ప్రజా రవాణా వినియోగంలో పెరుగుదలను చూసింది. అంతేకాకుండా, 2018 నుంచి 15 నగరాల్లో కంఫర్ట్ లెవెల్ అవగాహన మెరుగుపడింది. ఈ ఏడాది 12 నగరాలు అధిక పరిశుభ్రత రేటింగ్లను పొందాయని కూడా గమనించబడింది. ఇది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగదారుల పరిశుభ్రత పట్ల అవగాహనలో మెరుగుదలని సూచిస్తుంది. నడక మరియు సైక్లింగ్ సరైన రవాణా మార్గాలుగా పరిగణించబడతాయి. ప్రత్యేకించి ఫస్ట్ అండ్ లాస్ట్-మైల్ కనెక్టివిటీ కోసం, మరియు సురక్షితమైన మౌలిక సదుపాయాల లభ్యతపై తరచుగా ఆధారపడి ఉంటాయి. ఇది రెస్పాండెట్ల దృష్టిలో 2018తో పోల్చితే మెరుగుపడింది.
ఈజ్ ఆఫ్ మూవింగ్ ఇండెక్స్‌లో హైదరాబాద్‌కు సంబంధించిన కీలక ఫలితాలు
క్యాష్‌లెస్ మొబిలిటీ సేవలను ఆకట్టుకునేలా స్వీకరించినందుకు, చాలా పోటీదారులను అధిగమించి, భారతీయ నగరాల్లో హైదరాబాద్ ప్రత్యేకంగా నిలుస్తుంది. అంతేకాకుండా, అన్ని ప్రధాన రవాణా కేంద్రాలలో సైకిళ్లు మరియు మోటారు వాహనాల పార్కింగ్ సౌకర్యాల పట్ల సంతృప్తి చెందిన అత్యధిక సంఖ్యలో రెస్పాండెంట్లను కలిగిన ఘనతను హైదరాబాద్ సొంతం చేసుకుంది. దేశవ్యాప్తంగా వ్యక్తిగత వాహన యాజమాన్యం క్రమంగా పెరిగినప్పటికీ, వ్యక్తిగత వాహన వినియోగం - ఈజ్ ఆఫ్ మూవింగ్ ఇండెక్స్ (EoMI)లో వ్యక్తిగత మొబిలిటీగా సూచించబడుతుంది - హైదరాబాద్‌లో 2018లో 35% నుంచి 2022లో 29%కి తగ్గింది.
‘‘ఈజ్ ఆఫ్ మూవింగ్ ఇండెక్స్, 2022’’ నుంచి కొన్ని ఇతర కీలక ఫైండింగ్స్
జంట నగరాలైన పుణె మరియు పింప్రి చించ్వాడ్ 2022లో ఈజ్ ఆఫ్ మూవింగ్‌లో అత్యధిక స్కోర్లను సాధించింది; ముంబయి మరియు కోయంబత్తూర్ వీటికి చేరువగా ఉన్నాయి.
- ముంబైవాసులు నెలకు రవాణాపై అతి తక్కువ ఖర్చు చేస్తారు
- షేర్డ్ మొబిలిటీని కోల్‌కతా అత్యధికంగా స్వీకరించింది
- ఎలక్ట్రిక్ వాహనాలను అలవర్చుకోవడంలో అహ్మదాబాద్ అత్యధిక సుముఖత చూపిస్తుంది.
- స్త్రీలలో ప్రజా రవాణా వినియోగం మరియు ట్రాన్స్/ నాన్-బైనరీ లుధియానాలో అత్యధికంగా ఉంది
- భారతదేశంలో అత్యుత్తమ సైక్లింగ్ మౌలిక సదుపాయాలు చెన్నైలో ఉన్నాయి.