Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) పికప్ బ్రాండ్ బొలెరోలో కొత్తగా మాక్స్ శ్రేణీ ని ఆవిష్కరించింది. మంగళవారం హైదరాబాద్‌లో వీటిని ఆ కంపెనీ సౌత్ జోనల్ హెడ్ అరునంగ్షు లాంఛనంగా మార్కెట్లోకి విడుదల చేశారు. మాక్స్ శ్రేణీ నూతన మైలురాళ్లను సృష్టించనుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కొత్త శ్రేణీ అధిక పేలోడ్ సామర్థ్యం, మెరుగైన మైలేజ్ , పనితీరు, ఉత్తమ సౌకర్యం, భద్రత, అత్యంత విశ్వసనీయ, సమర్థ వంతమైన రవాణా పరిష్కారాన్ని అందిస్తుందన్నారు. కనీసం రూ.24,999 డౌన్ పేమెంట్‌తో దీన్ని బుక్ చేసుకోవచ్చన్నారు. ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్ పథకాలను కూడా అందిస్తోన్నామన్నారు. వీటి ధరల శ్రేణీని రూ.7.85 లక్షల నుంచి రూ.10.33 లక్షలుగా నిర్ణయించింది.