Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) సర్వర్ పదే పదే మోరాయిస్తోంది. బుధవారం కూడా సర్వర్ డౌన్ కావడంతో ఈ-పాస్బుక్ సేవల కోసం ప్రయత్నించిన లక్షలాది చందాదారులు అసహనం వ్యక్తం చేశారు. ఈపీఎఫ్ఓ పోర్టల్లోకి లాగిన్ అయ్యి ఇ-పాసుబుక్ సేవలు పొందాలని ప్రయత్నించినప్పుడు 404 పేజ్ నాట్ ఫౌండ్ అని ఎర్రర్ వస్తోంది. అసౌకర్యానికి చింతిస్తున్నామనే సందేశం దర్శనం ఇస్తుంది. దీనిపై ఇపిఎఫ్ఒకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి.