Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : అదానీ గ్రూప్ తన గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం 800 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.6,500 కోట్లు) సమీకరించనుందని సమాచారం. ఈ ఏడాది జనవరిలో హిండెన్‌బర్గ్ రిపోర్ట్ ఆరోపణల తర్వాత తీవ్ర ప్రభావితం అయిన అదానీ గ్రూపు తొలిసారి నిధుల సేకరణకు వెళ్లనుంది. కొత్త అప్పుల కోసం మిట్సూయి బ్యాంకింగ్ కార్ప్, డిబిఎస్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టడ్ తదితర గ్లోబల్ బ్యాంక్‌లతో చర్చలు జరుగుతున్నాయని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు పేర్కొన్నట్లు బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ చేసింది. 700 మిలియన్ డాలర్ల నుంచి 800 మిలి యన్ డాలర్లు సమీకరించాలని నిర్దేశించుకున్నట్లు సమాచారం.