Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఐటి, వైద్య, క్రెడిట్ కార్డ్ సేవలందించే విరించి లిమిటెడ్ బుధవారం నేషనల్ స్టాక్ ఎక్సేంజీ (ఎన్ఎస్ఇ)లో లిస్టింగ్ అయ్యింది. ముంబయిలోని ఎన్ఎస్ఇలో గంట మోగించే కార్యక్రమంతో ఈ మైలురాయిని సాధించినట్లు ఆ సంస్థ పేర్కొంది. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తోన్న తమ సంస్థ ఎన్ఎస్ఇలో లిస్టింగ్ కావడం వల్లన మరింత ఎక్కువగా పెట్టుబడిదారులను చేరడానికి అవకాశం దక్కిందని విరించి లిమిటెడ్ తెలిపింది. ఈ కార్యక్రమానికి విరించి లిమిటెడ్ ప్రమోటర్లు మాధవి లత కొంపెల్ల, కుమారి. లోపముద్ర కొంపేల్లతో పాటూ వైస్ ఛైర్మన్ వి సత్యనారాయణ, సిఎఫ్ఒ శ్రీనివాస రావు తదితరులు హాజరయ్యారు.