Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంక్షోభంలో పసిఫిక్ వెస్ట్రన్ బ్యాంక్
వాషింగ్టన్ : అమెరికన్ బ్యాంక్‌లు ఒక్కొక్కటిగా కుప్పకూలుతున్నాయి. తాజాగా పసిఫిక్ వెస్ట్రన్ బ్యాంక్‌లో సంక్షోభం చోటు చేసుకుంది. లాస్ఎంజెల్స్ కేంద్రంగా పని చేస్తోన్న ఆ బ్యాంక్ పతనం అంచున ఉంది. సమస్యల్లో కూరుకుపోవడంతో విక్రయించడం లేదా మూలధనం పెంచే చర్యలు చేపడుతున్నామని స్వయంగా ఆ బ్యాంక్ ప్రకటించడంతో పసిఫిక్ వెస్ట్రన్ బ్యాంక్ షేర్లు ఒక్క పూటలో 52 శాతం పతనమయ్యాయి. ఐదు రోజుల్లో 76 శాతం నష్టపోయింది. ఇదే బాటలో ఫీనిక్స్కు చెందిన ప్రాంతీయ బ్యాంక్ వెస్ట్రన్ అలయన్స్ బ్యాంక్‌కార్ప్ షేర్లు కూడా భారీ పతనాన్ని చవి చూశాయి. ఇప్పటికే పలు అమెరికన్ బ్యాంక్‌లు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న విషయం తెలిసిందే.
ఈ ఏడాది ప్రారంభం నుంచి ఒక్కో బ్యాంక్ దివాలా తీస్తోంది. ఇటీవల సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్విబి), ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్, సిల్వర్ గేట్ బ్యాంక్, సిగేచర్ బ్యాంక్‌లు దివాళా తీసిన విషయం తెలిసిందే. తాజాగా పసిఫిక్ వెస్ట్రన్ బ్యాంక్ కుదుపు అక్కడి బ్యాంకింగ్ పరిశ్రమను గజగజలాడిస్తోంది. ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేస్తోంది. రుణ బకాయిలు పేరుకుపోవడంతో పసిఫిక్ వెస్ట్రన్ బ్యాంక్ సంక్షోభంలో కూరుకుపోయింది. ''తమ రుణాల పోర్ట్‌పోలియోను విక్రయి ంచే ప్రక్రియను ఆ బ్యాంక్ వేగవంతం చేశాము. వాటాదారుల విలువను కాపాడేందుకు పలు భాగస్వాములు, పెట్టుబడిదారులతో సంప్రదింపులు జరుపుతున్నాము. చర్చలు పురోగతిలో ఉన్నాయి.'' అని ఆ బ్యాంక్ వెల్లడిం చింది. సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌తో మొదలైన సంక్షోభం ఇతర అనేక బ్యాంక్‌ల కు చేరడంతో అక్కడి ప్రభుత్వం, రెగ్యూలేటరీ సంస్థలు విత్త సంస్థల స్థిరత్వం కోసం పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ పెద్దగా ఫలితాలు ఇస్తు న్నట్లు కానరావడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం లేకపోలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.