Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : టాటా ప్లే బింజ్‌లో కొత్తగా వ్రాట్ యాప్ చేరడం ద్వారా 26 ఓటీటీలకు చేరువయినట్టు ఆ సంస్థ తెలిపింది. యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్, హార్రర్, డ్రామా తదితర విస్తృత శ్రేణీలో సినిమాలు, సిరీస్‌లు వ్రాట్లో అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. 2వేల గంటల పైగా గ్లోబల్ కంటెంట్‌ను అందిస్తుందని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉన్నతమైన యాక్షన్ షోల విస్తృతమైన రిపోజిటరీని తమ వీక్షకులకు అందించడానికి వ్రాట్తో భాగస్వామ్యం సంతోషంగా ఉందని టాటా ప్లే చీఫ్ కమర్షియల్ అండ్ కంటెంట్ ఆఫీసర్ పల్లవి పురి పేర్కొన్నారు.