Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిమాండ్లో 17 శాతం పతనం
న్యూఢిల్లీ : అధిక ధరల దెబ్బకు బంగారం అమ్మకాలు భారీగా పడిపోయాయి. ప్రస్తుత ఏడాది జనవరి నుంచి మార్చి కాలంలో భారత్లో పసిడి డిమాండ్ 17 శాతం పతనమై 112.5 టన్నులకు పరిమిత మయ్యిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) వెల్లడించింది. అధిక ధరలు డిమాండ్లో అస్థిరతను పెంచాయని తెలిపింది. గతేడాది ఇదే త్రైమాసికంలో 135.5 టన్నుల డిమాండ్ చోటు చేసుకుంది. దీంతో పోల్చితే దాదాపు 17 టన్నుల అమ్మకాలు పడిపోయాయి. 2010 నుంచి కరోనా సంక్షోభం ముందు వరకు దేశంలో నాలుగు సార్లు 100 టన్నుల దిగువన బంగారానికి డిమాండ్ చోటు చేసుకుందనిడబ్ల్యూజీస రీజినల్ సీఈఓ ఇండియా సోమసుందరం పేర్కొన్నారు. గత కొన్ని నెలలుగా దేశంలో 10 గ్రాముల బంగారం ధర రూ.60వేల ఎగువన నమోదవు తోంది. దీంతో వినియోగదారులు కొనుగోళ్లు చేయలేకపోతున్నారు.