Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏప్రిల్‌లో 18 శాతం పతనం
- నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడి
హైదరాబాద్ : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ప్రగతి కుంటు పడింది. ప్రస్తుత ఏడాది ఏప్రిల్ లో ఇక్కడ నివాస గృహాల రిజిస్ట్రే షన్లు 18 శాతం పతనమై 4,398 యూనిట్లకు పరిమితమ య్యాయి. విలువ పరంగం 20 శాతం కోల్పోయి రూ.2,230 కోట్లుగా నమోదయ్యిందని నైట్ ఫ్రాంక్ ఇండియా ఓ రిపోర్ట్‌లో వెల్లడిం చింది. హైదరాబాద్, మెడ్చల్- మల్కాజిగిరి, రంగారెడ్గి, సంగారెడ్డి జిల్లా ల్లోని అమ్మకాలను పరిగణనలోకి తీసుకుని ఈ రిపోర్ట్‌ను రూపొందించింది. 2022 ఇదే ఏప్రిల్‌లో రూ.2,784 కోట్ల విలువ చేసే 5,366 యూనిట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీటితో పోల్చితే గడిచిన నెలలో అమ్మకాలు తగ్గాయి. మొత్తం విక్రయాల్లో రూ.25-50 లక్షల విలువ చేసే నివాసాల వాటా 54 శాతంగా ఉంది. రూ.25 లక్షల దిగువన కలిగిన ఆస్తుల వాటా 18 శాతంగా నమోదయ్యింది. రూ.1 కోటి పైన విలువ చేసే గృహాల వాటా 13 శాతంగా ఉంది. కాగా.. అధిక ధర కలిగిన ఈ విభాగం విక్రయాల్లో మాత్రం 11 శాతం పెరుగుదల చోటు చేసుకోవడం విశేషం. ''ఏప్రిల్ 2023లో హైదరాబాద్ మార్కెట్ రిజిస్ట్రేషన్లలో తగ్గుదల నమోదు చేసినప్పటికీ.. ఇది గత సంవత్సరం ఇదే నెలలో కనిపించిన నమూనాకు అనుగుణంగా ఉంది. 1000-2000 చదరపు అడుగుల గృహాలకు డిమాండ్ పెరిగింది. ఇది మరింత స్థలం, సౌకర్యాలతో అప్‌గ్రేడ్ చేసిన గహాల కోరికను ప్రతిబింబిస్తుంది.'' అని నైట్ ఫ్రాంక్ ఇండియా సీనియర్ బ్రాంచ్ డైరెక్టర్ శాంసన్ ఆర్థర్ పేర్కొన్నారు.