Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగ్పూర్ : పర్యావరణ అనుకూల పత్తి ఉత్పత్తి కోసం అంబ్రెల్లా బ్రాండ్ 'పిన'ను ప్రారంభించినట్టు గోద్రెజ్ ఆగ్రోవెట్ వెల్లడించింది. విత్తనం విత్తడం నుంచి చురుకుగా పుష్పించే దశ వరకు కలుపు నిర్వహణ పరంగా పిన బ్రాండ్ విస్తృత శ్రేణీ ఉత్పత్తులను కలిగి ఉందని పేర్కొంది. ''పత్తి పంటలు తొలిదశలో నెమ్మదిగా పెరుగుతాయి.
పంటల మధ్య విశాలమైన ఖాళీ కారణంగా, కలుపు మొక్కలు పత్తి దిగుబడిని 45-50% వరకు ప్రభావితం చేస్తాయి. పినా బ్రాండ్లు విత్తనం విత్తడం నుండి పంట దశలో చురుకుగా పుష్పించే దశ వరకు కలుపు నిర్వహణ ఎంపికల విస్తత విండోను అందించడంతో, రైతులు ఇప్పుడు కలుపు రహిత పంటను ఎక్కువ కాలం పొందవచ్చు.'' అని జిఎవిఎల్ క్రాప్ ప్రొటెక్షన్ బిజినెస్ సిఇఒ రాజవేలు ఎన్కె పేర్కొన్నారు.