Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారెన్ బఫెట్ హెచ్చరిక
వాషింగ్టన్ : కృత్రిమ మేధ (ఏఐ) అణుబాంబు లాంటిదని ప్రపంచం లోనే అతిపెద్ద కుబేరుడు వారెన్ బఫెట్ అన్నారు. నెబ్రాస్కాలోని ఒమాహాలో జరిగిన బెర్క్‌షైర్ హాత్వే వార్షిక సమావేశంలో బఫెట్ మాట్లా డుతూ.. ఏఐని సృష్టించడమంటే అణు బాంబును తయారు చేసుకోవడమేనని హెచ్చరించారు. చాట్ జీపీటీ గురించి బిల్‌గేట్స్ చెప్పినప్పుడు తాను ఆశ్చర్యపోయానని పేర్కొన్నారు. మనం చేసే పని మంచిదై ఉండొచ్చు కానీ.. అందులోనూ కొన్ని దుష్ప్రయోజనాలు ఉన్నాయన్నారు. అందుకు నిదర్శనమే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అణుబాంబు ప్రయోగమన్నారు.