Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశంలో సుప్రసిద్ధ విద్యుత్ ద్విచక్రవాహన ఓఈఎంలలో ఒకటైన ప్యూర్ ఈవీ , తమ నూతన ఈవీ డీలర్షిప్ షోరూమ్, యూనివర్శిల్ ఆటోమోటివ్‌ను మదీనాగూడా, హైదరాబాద్ వద్ద ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎంఎల్ఏ శ్రీ అరికెపూడి గాంధీ తో పాటుగా పలువురు గౌరవ అతిథులు పాల్గొన్నారు. ఈ షోరూమ్ షరీఫ్ అండ్ సన్స్ కాంప్లెక్స్, బస్టాప్ వెనుక, మదీనాగూడా , హైదరాబాద్ వద్ద ఉంది. ఇది ప్రీమియం ఎక్స్పీరియన్స్ కేంద్రంగా ప్యూర్ బ్రాండ్ యొక్క విస్తృత శ్రేణి మోటర్‌సైకిల్స్ మరియు స్కూటర్లను ప్రదర్శించనున్నారు. దేశవ్యాప్తంగానే కాక విదేశాలలో సైతం ఉన్న తమ డీలర్షిప్ నెట్వర్క్ ద్వారా 60వేలకు పైగా విద్యుత్ ద్విచక్రవాహనాలను ప్యూర్ ఈవీ డెలివరీ చేసింది. ఈ కంపెనీ ఒక లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్యాక్టరీని తెలంగాణాలో ప్రారంభించింది. దీనిలో వాహన మరియు బ్యాటరీ తయారీ డివిజన్లు ఉన్నాయి. ఈ కంపెనీ మరింతగా తమ తయారీ కార్యకలాపాలను రెండు లక్షల చదరపు అడుగుల ప్రాంతానికి విస్తరించడంతో పాటుగా వాహన వార్షిక ఉత్పత్తిని 1,20,000 యూనిట్లకు చేర్చనుంది. దీనితో పాటుగా వార్షిక బ్యాటరీ ఉత్పత్తి సామర్ధ్యంను 0.5 గిగావాట్‌హవర్‌కు విస్తరించనుంది. ఇది 2023 ఆర్ధిక సంవత్సరాంతానికి సిద్ధం కానుంది. ప్యూర్ ఈవీ ఇటీవలనే భారతదేశంలో అత్యంత అందుబాటు ధరలోని విద్యుత్ మోటర్‌సైకిల్ ఎకోడ్రిఫ్ట్‌ను విడుదల చేసింది.
మదీనాగూడాలో ప్యూర్ ఈవీ యొక్క డీలర్షిప్ ప్రారంభం గురించి సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ రోహిత్ వదేరా మాట్లాడుతూ ‘‘ఐటీ రంగం విస్తరించిన తరువాత మదీనాగూడ వృద్ధి కూడా గణనీయయంగా పెరిగింది. జానాభా వృద్ధిచెందడంతో పాటుగా అభివృద్ధి కూడా వేగవంతంగా ఉంది. విద్యుత్ మొబిలిటీ పరంగా ప్రోత్సాహంతో పాటుగా ఈవీలకు డిమాండ్ పెరుగుతుండటంతో, ఓఈఎంలు తమ చేరికను విస్తరించేందుకు మదీనాగూడా ఒక చక్కటి అవకాశంగా నిలుస్తుంది. ఈ నూతన డీలర్షిప్, రాష్ట్రంలో మా 14వ ప్రత్యేక మరియు హైదరాబాద్ నగరంలో 8వ స్టోర్‌గా నిలుస్తుంది. అంతేకాదు, రాష్ట్ర వ్యాప్తంగా మా కార్యక్రమాలు విస్తరిస్తోన్న వేళ తెలంగాణా రాష్ట్రం పట్ల మా నమ్మకం, నిబద్ధతను ఇది వెల్లడిస్తుంది. గౌరవనీయ ముఖ్యమంత్రి, కెసీఆర్ గారు ముందు చూపు కారణంగా దేశంలో ఈవీ వ్యవస్ధకు కేంద్రంగా తెలంగాణా నిలిచింది. తెలంగాణా మొబిలిటీ వ్యాలీ (టీఎంవీ) పూర్తి స్పష్టత మరియు నమ్మకాన్ని ఈవీ రంగంలోని సంస్ధలకు అందించడంతో పాటుగా భారతదేశపు ఈవీ ప్రయాణంలో తెలంగాణా పాత్ర గురించి కూడా అవగాహన కల్పించింది’’అని అన్నారు. తాము సొంతంగా అభివృద్ధి చేస్తోన్న ఉత్పత్తులు మరియు సర్వీస్ నెట్వర్క్ ప్రాముఖ్యతను గురించి శ్రీ రోహిత్ వధేరా మాట్లాడుతూ ‘‘తమ ఆర్ అండ్ డీ కేంద్రంలో ఉత్పత్తి డిజైన్ మరియు అభివృద్ధి పరంగా శక్తివంతమైన బృందాన్ని ప్యూర్ ఈవీ కలిగి ఉంది. కంపెనీ యొక్క కీలకమైన ఆర్ అండ్ డీ కార్యకలాపాలు సామాన్య భారతీయ వినియోగదారుని అంచనాలకు అనుగుణంగా ఉంటాయి. పరిశ్రమలో అత్యాధునిక వర్క్‌షాప్‌ల ఏర్పాటు ద్వారా మా వినియోగదారులకు అత్యుత్తమంగా అమ్మకం తరువాత సేవా అనుభవాలకు భరోసా అందిస్తున్నాము’’ అని అన్నారు. ప్రస్తుతం ప్రముఖ విద్యుత్ ద్విచక్రవాహన బ్రాండ్లలో ఒకటిగా ప్యూర్ ఈవీ నిలువడంతో పాటుగా దేశవ్యాప్తంగా తమ డీలర్‌షిప్‌ను వేగంగా విస్తరిస్తోంది.